దాదాపు 50 రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసి యూనియన్లకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఆర్టీసి నడుపుతన్న కొన్ని రూట్ల ప్రైవేటీకరణ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. కోర్టు మంత్రివర్గ నిర్ణయాన్ని సమర్థించిండి.
ఆర్టీసి కార్మికులు చేస్తున్నడిమాండ్లలో ప్రధానమయినది సంస్థను ప్రభుత్వంలోవిలీనం చేయడం. అంటే సంస్థ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులు గా పరిగణించడం.ఇపుడు కోర్టు ప్రయివేటీకరణనను సమర్థించడం వల్ల ఆర్టీసియూనియన్ల చేస్తున్న ఒక ముఖ్యమయిన డిమాండ్ మీద ప్రభుత్వానిదే పైచేయి అయింది.
గత వారం ఆర్టీసి సమ్మె పరిష్కార విషయాన్ని తెలంగాణ లేబర్ కోర్టు కు పరిమితం చేసి హైకోర్టు తప్పుకోవడం సమ్మెలో ఉన్న కార్మికులకు మొదటి ఎదురు దెబ్బ. ఇపుడు రూట్లను ప్రైవెటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించడం మరొక దెబ్బ.