ప్రజా సౌకర్యాలను కలిగించేందుక్కు ప్రాజెక్టు ‘బిల్డ్ ఎపి ’ (Build AP) కార్యక్రమం అభిలషణీయమే దాని కోసం ప్రభుత్వం అమ్మేయడం మానుకోవాలని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న రిటైర్డు ఐఎఎస్ అధికారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రాజెక్టులు ఎంతో అవసరం, వాటికి అవసరమయిన నిధులకోసం ప్రభుత్వ భూములను అమ్మడం వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ముఖ్యమంత్రి కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ఇలా ప్రభుత్వ భూములను అమ్మాలనుకుంటే ఇపుడున్న వాతావారణంలో వాటిని రియల్ఎస్టేట్ మాఫియా గద్దల్లా వాలి తన్నుకుపోతారని ఆయన హెచ్చరించారు.అంతేకాదు, ఇలా ప్రభుత్వ భూములను అమ్మాలనుకోవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందని కూడా ఆయన ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.
*రాష్ట్రంలో తలసరి భూ విస్తీర్ణం తగ్గు ముఖంలో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ భూముల కోసం గ్రద్దలలాగ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తే, వారు కుమ్మక్కయ్యి తక్కువ ధరకు కొనే అవకాశం బాగా ఉంటుంది. పైగా భూముల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాని తగ్గడం లేదు. కనుక ప్రభుత్వ భూములను “మార్కెట్ ధర” కు అమ్ముతామని అనుకోడం మనను మనమే వంచించు కోవడం అవుతుంది. వేలంలో అమ్మకం అయిన ప్రభుత్వ భూమి ధర కొన్నిరోజులలోనే అంతకన్నా అధికమైన ధరకు ఇంకొకరి చేతులలోనికి వెళ్లే అవకాశం ఉంది. అందువలన ప్రభుత్వం విమర్శలకు గురి అవుతుంది.
*భూములను వేలం వేయడం వలన ఆ ప్రాంతంలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి వలన తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు నష్టం కలుగుతుంది. అందువలనే, ప్రభుత్వాలు భూములను అమ్మే ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు.
*ప్రభుత్వావసరాల కోసం పెద్ద ఎత్తున భూములు కావాలి. ఒక వైపు తమ అధీనంలో ఉన్న భూములను అమ్ముకుని, ఇంకొక వైపు తమ అవసారాల కోసం భూములను అంతకన్నా అధికమైన ధరలకు కొనడం సబబుగా ఉండదు.