ఇన్ ఫర్మేన్ షేరింగ్ అనేది ఈ కాలం లక్షణం. తెలిసిన ఇన్ ఫర్మేషన్ ను షేర్ చేసుకోకుండా ఉండలేని పరిస్థితిని సోషల్ మీడియా తీసుకువచ్చింది. ఎవరేం చెబుతన్నారో చూడాలి, తనకు తెలిసింది నలుగురితో పంచుకోవాలనే తాపత్రయం ప్రతి మనిషిలో తీసుకువచ్చింది సోషల్ మీడియా.
ప్రజలే కాదు, ప్రభుత్వ శాఖ లు కూడా ప్రతిక్షణం ప్రజలతో సంపర్కంలో ఉండేందుకు సోషల్ మీడియాను వాడుతున్నాయి.
ఈ మధ్య కాలంలో ప్రజలనుంచి దూరంగా ఉంటున్నారన్న అపప్రథ పోగొట్టుకునేందుకు పోలీసు శాఖ కూడా తాము ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునేందుకు సోషల్ మీడియా ను, ముఖ్యంగా ట్విట్టర్ , ఫేసు బుక్ లను బాగా వాడుతున్నాయి.
అయితే, విశాఖపట్టణం సిటీ పోలీసుల మాత్రం దీనిని బాగా ఈ గొప్ప మీడియంని నిర్లక్ష్యం చేసినట్లు వాళ్ల ఫేస్ బుక్ పేజీ చూస్తే అర్థమవుతుంది.
@visakhapatnamcitypolice పేరుతో వాళ్ల కొక పేజ్ ఉంది. అయితే దానిని వాళ్లు మర్చిపోయి అయిదు నెలలయింది. జూన్ 27 వ తేదీన ఒక పోస్టు పెట్టారు. అది కూడా పోలీసు కమిషనర్ గా రాజీవ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పటి పోస్టు. అంతే, అదే చివరి పోస్టు.
అప్పటి నుంచి ఇప్పటి దాకా మరొక పోస్టు లేదు. అంటే ఫేస్బుక్ పేజీని మర్చిపోయారన్నమాట. ఇదెలా జరిగి ఉంటుంది. విశాఖ పట్నం పోలీసుల దగ్గిర ప్రజలతో షేర్ చేసుకునేందుకు ఏ సమాచారం లేదా? లేక పోస్టు చేయలేనంతా బిజీగా ఉన్నారా లేక లేజీగ ఉన్నారా?
ఇదెంత అన్యాయం?
నిన్న విశాఖ పట్టణంలో మహారాణి పేట పోలీసు స్టేషన్ ఒక లేడీ రోబో కాప్ ను ఏర్పాటు చేశారు. ఇదొక గొప్పకొత్త ప్రయోగం. దీనిని పేరు సైబిర (cybira). ఇది ప్రజల ఫిర్యాదులు వింటుంది. రికార్డు చేసుకుంటుంది. రిజస్టర్ చేస్తుంది. ఈ ఫిర్యాదు మీద అధికారులు స్పందించకపోతే 24 గంటల తర్వాత గుర్తుచేస్తుంది. ఈ మంచి వార్త కు సంబంధించిన ఫోటోలేమయినా దొరుకుతాయోమోనని @visakhapatnamcitypolice FB పేజీలోకి వెళితే… అవాక్కయ్యాం. ఈ వార్తలేకపోవడం కాదు, అసలు అయిదు నెలలుగా పోస్టులే లేవు.
పేజీ మార్చారా లేక మర్చిపోయారా? తెలియదు. వాళ్లే చెప్పాలి.