విజయవాడ కుర్రవాడు స్థాపించిన స్విగ్గీ ఎలా పెరిగిందో చూడండి…
స్విగ్గీ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ భారతదేశంలో బాగా విస్తరించిపోయింది. ఈ సంస్థ ఇప్పటి దాకా 500 కోట్ల పుఢ్ ఆర్డర్స్ ను డెలివరీ చేసింది.
ఇపుడు దేశంలో 500 పట్టణాలలో స్విగ్గీ సర్వీసు అందుబాటులో ఉంది. 1,47,000 రెస్టరెంట్లో ఈ యాప్ కు టైఆప్ఉంది.
స్విగ్గీ ఫుడ్ ఆర్డర్స్ ను డెలివరీ చేసేందుకు 2.1 లక్షల మంది డెలివరీ పార్ట్ నర్లున్నారు. స్విగ్గి ఎక్కడెక్కడ మార్కెట్ లో ఉందో అక్కడ మొత్తం ఫుడ్ డెలివరీలో స్వీగ్గీ వాటా 20 శాతం చేరుకుంది.
ఇపుడు స్విగ్గీ ఒక కొత్త వ్యవస్థను విస్తరించాలనకుంటున్నది. దాని పేరు స్విగ్గీ యాక్సెస్. ఇది 2017లో మొదలయింది.
దీని మీద ఇప్పటికే ఈ కంపెనీ రు. 175 కోట్లు ఖర్చు చేసింది. మరొక 75కోట్ల ఖర్చు చేయాలనుకుంటున్నది.
స్విగ్గీ యాక్సెస్ అంటే ఏమీ లేదు, కొన్ని రెస్టరెంట్ల ఫుడ్ కు బాగా డిమాండ్ ఉంటుంది. ఆ ఫుడ్ ను అందరికీ అందుబాటులో కి తెచ్చేందుకు స్విగ్గీ ఒక కొత్త పద్దతి కొనుగొంది. తనే కిచెన్ తయారుచేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే కిచెన్. అంటే పార్టనర్ రెస్టరెంట్లు తమ తమ వంట సామాగ్రి తెచ్చుకుని ఇంట వంటలు చేస్తాయి. ఇది బెంగుళూరులో మరాఠా హల్లి ఏరియాలో మొదలయింది. అక్కడ బేస్ కిచన్ లో అయిదు రెస్టరంట్లతో ఇది స్విగ్గీ యాక్సెస్ క్లౌడ్ కిచెన్స్ తొలి విడత వసతి ప్రారంభమయింది. మొదటి సంవత్సరం 100 కిచెన్ లతో మొదలయి ఇపుడు వేయి కిచెన్ల దాక చేరుకుందని స్విగ్గీ సప్లై సిఇవొ విశాల్ భాటియా యువర్ స్టోరీకి చెప్పారు.
ఇది మొదట అయిదు నగరాలలో మొదలయింది. ఇపుడు 14 నగరాలకు విస్తరించింది. మరొక నాలుగయిదు నెలల్లో మరొక 12 నగరాలకు విస్తరించనుంది.
స్విగ్గీని ఎవరు స్థాపించారో తెలుసుగా.. శ్రీహర్ష మాజేటి CEO(విజయవాడు),నందన్ రెడ్డి, రాహుల్ జైముని,. వీళ్లు మొదటి ఇద్దరు బిట్స్ పిలానీ విద్యార్థులు. జైముని ఖరగ్ పూర్ ఐఐటి విద్యార్థి. 2004 లో ఈ ఫుడ్ రంగంలోకి వచ్చారు. అంతకుముందు కొద్ది రోజులు లాజిస్టిక్స్ రంగంలో ఉండి ఫుడ్ వైపు వచ్చారు. వాళ్ల మొదటి కంపెనీ పేరు బండిల్ (Bundl) .కోరుకున్న వాళ్లకి కోరుకున్న ఆహారాన్ని కోరుకున్న సమయంలో ఇంటి దగ్గరకు చేర్చే ఏర్పాటుతో 2014లో స్విగ్గీ ఫుడ్ యాప్ ప్రారంభించారు. బెంగుళూరు కోరమంగళం ఏరియాలో 25 పార్ట్నర్ రెస్టరాంట్లలో ఆరుగురు డెలివరీ ఎగ్జిక్యూటివ్ లతో స్విగ్గీ చిన్నగా మొదలయింది.
తాజా సమాచారం మేరకు స్విగ్గీ మరొక పుడ్ టెక్ యాప్ జొమాటో(zomato) విలీనం కోసం చర్చలు జరుపుతున్నాయి. అయితే, జొమాటో ప్రతినిధులు దీనిని ఖండించారు. ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ లోకి అమెజాన్ ప్రవేశిస్తున్నదనే వార్తలు వెలువడటంతో బెంగుళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ, గుడ్ గావ్ కు చెందిన జొమాటో విలీనమయి అమెజాన్ ను ఎదుర్కోవాలని చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. ఇది తప్పని జొమాటో ప్రతినిధులు ఖండించారు.