ఇదెక్కడో తెలిస్తే అవాక్కవుతారు..

ఈ ఫోటోలు ఎక్కడో అమెరికాలోనే, లేదా ఆస్ట్రేలియాలోనో ఒక పేరుమోసిన రిసార్టివి అనుకుంటున్నారా? కాదు. మన పక్కనే ఉన్న సోమశిలవి.   హబూబ్ నగర్ జిల్లా కోల్లాపూర్ పక్కనే ఉన్న సోమశిలవి.
కోల్లాపూర్ దగ్గిర ఒక సోమశిల అనే వూరుంది. ఒకపుడది ఆలయపట్టణం. సోమశిలతో పాటు  చుట్టుపక్కల 15 పురాతన శివాలయాలున్నాయి. అక్కడ శివరాత్రిపండగ తో పాటు కార్తీక సందడి బాగా ఉంటుంది. పుష్కర ఘాట్ కూడా.  ఇపుడావూరు రూపురేఖలిలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ వూరు ఇపుడు ఒక అందమయిన రిసార్టుగా మారిపోయింది.
మహబూబ్ నగర్ పట్టాణానికి  120 కిలో మీటర్ల దూరంలో కృష్ణా నది తీరాన సోమశిల ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. మంచి రోడ్డు ఉంది.
అక్కడ తెలంగాణ టూరిజం వాళ్ల హరిత హోటల్ కూడా ఉంది.  ఒక నలభై మంది దాకా కూర్చోవచ్చు. సరదా చూట్టు నదిని చూస్తూ అహ్లాదకరంగా గడపవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు కూడా బాగా జాగా ఉంది. పచ్చని చెట్లతో ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అక్కడ దాదాపు అయిదారుకోట్లు ఖర్చు చేసి అందమయిన కాటేజీలు నిర్మించి ఈప్రాంతాని పర్యాటక కేంద్రంగా మార్చారు.ఈ పోటోలను అక్కడికి వచ్చిన యాత్రిడొకరు ఈ ఫోటో లు తీశారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/tea-helps-college-students-in-increasing-mental-clarity-attention-and-alertness-reason-theanine/