ఈ ఏడాది గత క్వార్టర్ అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ లలో భారత దేశ ఆర్థికప్రగతి బాగా తగ్గిందని ఇది అయిదుశాతం లోపు ఉంుందని ఆర్థికనిపుణులు చెబుతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఆర్థిక నిపుణులు, నోమూరా హోల్డింగ్స్ కుచెందిన నిపుణులు, క్యాపిటల్ ఎనకమిక్స్ లిమిటెడ్ కు చెందిన వాళ్లు ఏకధాటి గా ఈ విషయాన్ని చెబుతున్నారు. సెప్టెంబర్ తో ముగిసిన ఈ ఏడాది రెండో క్వార్టర్ లో ఆర్థిక ప్రగతి 4.2 శాతం నుంచి 4.7 శాతం మధ్య ఉంటుందని వారు అంచనావేస్తున్నారు.
ప్రాథమిక వివరాలను బట్టి ఈనిపుణులు వేసిన అంచనా ఇది.
భారత ప్రభుత్వం నుంచి ఈ నెల 29న ఈ క్వార్టర్ లో ఆర్థిక ప్రగతి ఎంత ఉందనే అంకెలు విడుదల కానున్నాయి. 2012 నుంచి ఇప్పటిదాకా చూస్తే 4.2 శాతం ప్రగతి రికార్డు కావడం ఇదేమొదటిసారి.
ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో ప్రగతి రేటు అయిదు శాతం నమోదయింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం, డొమెస్టిక్ క్రెడిట్ కండిషన్స్ అనుకూలంగా లేకపోవడం, కన్య్సూమర్ డిమాండ్ పడిపోవడంతో ఆర్థిక ప్రగతి మందగించిందని ,అందువల గత క్వార్టర్ లో ఇది 4.2 శాతం దాటకపోవచ్చని సింగపూర్ సంస్థ నోమూరా ఇండియా, ఏసియా ఛీఫ్ ఎకనామిస్టు సోనల్ వర్మ చెబుతున్నారు.
ఇప్పటికే రిజర్వు బ్యాంక్ అయిదు సార్లు వడ్దీరేటు తగ్గించింది. మరొక సారి డిసెంబర్ భారీగా తగ్గించే అవకాశముందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కాంతి ఘోస్ చెబుతున్నారు.
అయితే, ఇలాంటి చర్యల వల్ల వెంటనే ప్రయోజనం ఉంటుందని ఆమె భావించడం లేదు. సింగపూర్ కు చెందని క్యాపిటల్ ఎకనమిక్స్ సీనియర్ ఎకనమిస్ట్ షిలాన్ షా ప్రగతి రేటు 4.7 శాతం దాకా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.