నేపాల్ లో ఈ సాయంకాలం వచ్చిన భూకంపంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, లక్నో తదితర ఉత్తరాది నగరాలుకంపించాయి. ఈ భూకంపం కేంద్రం (epicentre) నేపాల్ లో ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలే మీద 5.3 పాయింట్లగా నమోదయింది. నేపాల్ లోని దైలేఖ్ జిల్లాలో భూమికి 14 కి.మీ లోతున ఈభూకంపం ఎపిసెంటర్ ఏర్పడిందని ఈ సాయంకాలం 7.05 కు కనిపెట్టారు. నేపాల్ భూకంప ప్రభావంతో చండీ గడ్, నోయిడా, గురుగ్రాం, ఘాజియాబాద్, ఫరీదాబాద్ లతో పాటు ఉత్తరాఖండ్ లో కూడా ప్రకంపనలు రికార్డయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాజధానిలో ప్రకంపనలు రాగానే ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు.
నేపాల్ భూకంప అధ్యయనం కేంద్రం సమాచారం ప్రకారం సాయంకాలం 7.15 భజంగ్ జిల్లా ప్రాంతాంలో భూకంప తీవ్రత 5.7 పాయింట్లు గా నమోదయింది.
An Earthquake of Ml 5.7 around pauwagadhi Bajhang at 19:15(2076/08/03)
— NSC, Nepal (@NepalNsc) November 19, 2019