ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఆర్టీసీ ఇంచార్జి ఎండి సునీల్ శర్మ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మిక సంఘాలు, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని,సీనియర్ ఐఏఎస్ తప్పుడు అఫిడవిట్ ను కోర్ట్ లో వేశారు.దాన్ని సిజే సుమోటోగా స్వీకరించాలి. పొలిటికల్ పార్టీలమీద చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకోవాల ని ఆయన కోరారు.
కాంగ్రెస్ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదని, అధికారి పచ్చి అబద్ధాలు చెబుతున్నార ని ఉత్తమ్ అన్నారు.
అఫిడవిట్ సమర్పించిన ఐఏఎస్ ను డిస్మిస్ చేయాల ని ఆయన డిమాండ్ చేశారు.
ఉత్తమ్ ఇంకా ఏమన్నారంటే…
ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం.
సునీల్ శర్మ ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి అఫిడవిట్ వేశారో చెప్పాలి.
ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే మా పై కేసులు పెట్టాలి.
ఏపీఎస్ ఆర్టీసీ గిన్నిస్ రికార్డ్ కు ఎక్కింది.
కార్మికుల న్యాయమైన డిమాండ్ పట్టించుకోకుండా కేసీఆర్ తెలంగాణ తన జాగీర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఆర్టీసీ నిలబడాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
సెప్టెంబర్ నెల వేతనాలను వెంటనే చెల్లించాలి.
19న ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సడక్ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు.
ఆర్టీసీ పై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
24మంది కార్మికులు చనిపోయినా సీఎం అహంకారం తగ్గలేదా
సునీల్ శర్మ పై డివోపిటి కి ఫిర్యాదు చేస్తాం..