82 సంవత్సరాల కిందట నవంబర్ 16న రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ, ఆంంధ్ర ప్రాంత నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలోని అంశాలను ఇంతవరకు అమలుచేయలేదు. తెలంగాణ ఏర్పడి , ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూపంలోమళ్లీ ప్రత్యక్షమయినందున శ్రీబాగ్ వప్పందం అమలుచేయాల్సిన అవసరం ఏంతయినా ఉందని రాయలసీమ నాయకులు అంటున్నారు.
ఒప్పందాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకొనకపోవడంతో రాయలసీమ నాలుగు జిల్లాలలో ఈ రోజు నిరసన వ్యక్తమయింది. ప్రజాప్రతినిధుల ముట్టడితో,సత్యాగ్రహదీక్షలతో రాయలసీమ అట్టుడికింది. రాయలసీమ ఉద్యమానికి సన్నద్ధమవుతూ ఉందనేందుకు ఇది నిదర్శనం. దానికి సంబంధించిన దృశ్యమాలిక ఇది.