తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తూ.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీ.వో. ఇచ్చినందుకు నిరసనగా ప్రముఖ కవి, తెలుగు పరిశోధకుడు డాక్టర్ ఉద్దండం చంద్ర శేఖర్ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ ద్వారా పొందిన పీహెచ్. డీ డాక్టరేట్ పట్టాతో పాటు బంగారు పతాకాన్ని వెనక్కి ఇచ్చారు.
ఈ రోజు ఆయన శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం లోపల ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలిపారు.
ఒక తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తూ.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీ.వో. ఇచ్చినందుకుగాను తన వంతుగా తెలుగు పరిశోధకుడిగా, కవిగా, పాత్రికేయుడిగా నా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు .
తన పిహెచ్ డి పట్టాను, బంగారు పథకాన్ని వర్శిటీ ఉపకులపతికి అందచేశారు.
తెలుగు విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, తల్లిదండ్రులు, వివిధ సాహిత్య, కళా, ప్రజా, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తాను చేస్తున్న అమ్మభాష ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. ఆయన భువన విజయం సాహిత్య మాస పత్రిక సంపాదకుడుకూడా.ఆయనను చరవాణి : 9441433833 ద్వార సంప్రదించవచ్చు.