భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన చేపట్టిన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 8 గం.కు మంగళగిరిలోని చిల్లపల్లి కళ్యాణ మండపం వద్ద ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ సృష్టించిన ఇసుక కొరత వల్ల 55 మంది చని పోతే, వారికుటుంబాలను ఓదార్చేందుకు జగన్ ఎందుకు వెళ్లడంలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు కష్టాల్లో ఉన్నపుడు వాళ్ల కోసమే సేకరించిన సెస్ నుంచి వారికి ఎందుకు సహాయం చేయడం లేదని ఆయనప్రశ్నించారు. కార్మికుల డబ్బుల కార్మికుల పంచడానికి మీకు వస్తున్న సమస్య ఏమిటి, మేమేమన్నా మీ జేబు నుంచి ఇవ్వమంటున్నామా లేక భారతి సిమెంటునుంచి ఇవ్వమంటున్నామా అని ఆయన నిలదీశారు.
తర్వాత అమరావతి ప్రస్తావన తెస్తూ ఆయన జగన్ మీద దాడిప్రారంభించారు. తాన ఆరోజు అమరావతికి ఇంత భూమి అవసరంలేనదని అన్నానని, ఇపుడే అదేవాదన మీద ఉన్నానని చెబుతూ ఎన్ని ఎకరాల్లో మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారో వెల్లడించాలని పవన్ డిమాండ్ చేశారు.
మీరు రాజధాని ఎక్కడ కట్టాలనుకుంటున్నారు, అమరావతిలోనే కడతారా లేక ఇడుపుల పాయకు తీసుకు వెళ్తారా , ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.