అసలు రాష్ట్రంలో ఎవరికీ ఇసుక అందకుండా పోయేందుకు చంద్రబాబు కంప్యూటర్ పరిజ్ఞానమే కారణమని వైసిసి ఎంఎల్ఏలు కే పార్థసారథి, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇసుక కుట్ర చేశాడని వారి ఆరోపించారు. చాలా సీరియస్ ఆరోపణ చేశారు. మరి ఇపుడేంచేస్తార్ చూడాలి.
ఎంఎల్ ఏ పార్థసారథి విమర్శలు
ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడేలా
చంద్రబాబు కుట్ర పన్నారు. అది ఎలాగంటే… తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న విశాఖ బ్లూఫ్రాగ్ కంపెనీ రంగంలోకి దించాడు. ఈ కంపెనీతో ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రభుత్వ వెబ్సైటును హాక్ చేయించాడు. ఇసుక అందుబాటులోకి వస్తోన్న సమయంలో కావాలని వెబ్‌సైట్‌ను హాక్ చేయించి కొరత ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశాడు,’ అని పార్థసారధి ఆరోపించారు.
దీనికి తోడు కార్మికుల సంక్షేమానికి తన హయాంలో ఏమాత్రం పని చేయని చంద్రబాబు భవన నిర్మాణ కార్మికుల పేరుతో దొంగ దీక్ష చేశారు. నిజంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా తన రాజకీయ ప్రయోజనాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రచారం కోసం టీవీ కెమెరాలు రాగానే గంపను నెత్తిన పెట్టుకుని కార్మికుల పక్కన ఫోజులిచ్చారు.
చంద్రబాబుకు దీక్షలంటే ఒక ఆటవిడుపు. దీక్షల వల్ల వెయిట్ లాస్ అవుతుందని టీడీపీ నేతలు ఇది వరకు వ్యాఖ్యానించారు.
ఆయన తప్పుడు విధానాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దీక్షా సమయంలో చంద్రబాబు పక్కన కూర్చున్నది ఇసుకాసురులు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దందాలతో కోట్లు సంపాదించిన వ్యక్తులు.
ఎన్నికల హామీలను క్రమంగా అమలు పరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటోన్న ముఖ్యమంత్రి శ్రీవైయస్ జగన్ ను చూసి చంద్రబాబు కడుపు మంట. అక్కసుతో దొంగ దీక్ష చేశారు. నిరూపిత సాక్ష్యాధారాలు లేని ఛార్జి షీటును విడుదల చేశారు.
వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవమైనా సమస్య పరిష్కారానికి వైయస్సార్సీపీ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు వీలుగా ఈనెల 7న 70 వేల మెట్రిక్ టన్నులు, ఇవాళ లక్షన్నర మెట్రిక్ టన్నుల మేర ఇసుకను అందించాం. ప్రతి రోజు రోజుకు ఇసుక లభ్యత పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ సమయంలో చంద్రబాబు దొంగ దీక్ష చేపట్టారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి పూనుకున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ పెద్దలు దాచిన వేలాది టన్నుల ఇసుకను బయటికి తీసింది మా ప్రభుత్వం కాదా? బాబుకు డేరా బాబుకు తేడాయే లేదు.
వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విమర్శలు
ఇసుక స్మగ్లింగును ప్రోత్సహించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నిర్వాకం వల్లే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి వంద కోట్ల జరీమానా విధించిన విషయం వాస్తవం కాదా?
అలాంటి వ్యక్తి ని చంద్రబాబు తన దీక్షలో పక్కనే కూర్చోబెట్టుకున్నారు. దేవినేని గ్యాంగ్ వల్ల టీడీపీకి చెడ్డ పేరు వచ్చింది. ప్రజా విశ్వాసం కోల్పోయిన టీడీపీ ని రక్షించే పని కోసమే చంద్రబాబు దొంగ దీక్ష చేశారు.హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయాన్ని అద్దెకు ఇచ్చే స్థితి వచ్చింది. అమరావతిలో నిర్మిస్తోన్న టీడీపీ భవనాన్ని ప్రారంభించే అవకాశం రాకపోవచ్చేమో.
దేవినేని తమ్ముడు మా పక్కన చేరారు. మరో తమ్ముడు అవినాశ్ వైయస్సార్సీపీలో చేరనున్నారు. టీడీపీ పని అయిపోయింది. రోజు రోజుకూ క్షీణిస్తోన్న టీడీపీకి వచ్చే ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాదు. అబద్ధాలకు మోసాలకు మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు ఏ రోజు కూడా ప్రజా పక్షం వహించలేదు. ఆయన సేవలన్నీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ధనవంతులకు మాత్రమే పరిమితం. పేదలంటే చంద్రబాబుకు గిట్టదు.
ఎంఎల్ఏ కే కైలా అనిల్‌కుమార్ వ్యాఖ్యలు