రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇసుక సమస్య లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఎందుకు లేదంటే ఆయన సింపుల్ గా ఇలా చెప్పారు:
రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ సగటు ఇసుక వినియోగం 80 వేల టన్నులు అయితే ఇప్పుడు 1.20 లక్షల టన్నులు అందిస్తున్నాం. గత మూడు నెలలుగా ఇసుక సమస్య తలెత్తడంతో అధిక మొత్తంలో ఇసుక అవసరం అయినందున వాటిని 2 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నం. దీనికోసం 137 ఇసుక రీచ్ పాయింట్లను 180కి పెంచినాం.
ప్రస్తుతం అన్ని చోట్ల స్టాక్ పాయింట్ లలో వినియోగదారుల కోసం ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంచుతున్నాం. రాష్ట్రంలో 275 ఇసుక రీచ్ లకు గానూ ఈ నెల 6వ తేదీ నాటికి 83 ఇసుక రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు అంటే 11వ తేదీ వరకు మొత్తం 99 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయి.’ ఇంక కొతర ఎక్కడుందన ఆయన లెక్కలేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ప్రణాళిక, విధివిధానాలను ఖరారు చేస్తూ ఆదేశాలివ్వడం జరిగింది.. ఇసుక రీచ్ పంపిణీ కేంద్రాల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు ఆయా జిల్లాల మంత్రులతో ప్రారంభోత్సావాలను నిర్వహిస్తారు.
అన్ని స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల వద్ద ఒక పండుగ వాతావరణంను కలుగచేస్తాం. సీసీ కెమెరాలు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికడుతున్నాం.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నాం.’ అని మంత్రి అన్నీ లెక్కలేసి చెప్పారు.
అయినా సరే మార్కెట్ లో ఇసుకదొరకడం లేదుని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఇసుక ఎటువోతోంది? అదే రాజకీయం.