సహచర మిత్రులార! వరంగల్ అంటేనే ప్రజాకవి కాళోజీ యనీ ,కాళోజీ అంటేనే వరంగల్ మనం అంటుంటం. అంతేకాకుండా కాళోజీ మాటే మా మాట కాళోజీ బాటే మా బాట కాళోజీ వారసత్వాన్నికొనసాగిస్తాం అంటూ ప్రతి సాహిత్య సభలో సమావేశంలో గుండెలు ఉప్పొంగేటట్లు ప్రసంగిస్తం,పాట పాడుతం.
మరి మన కాళన్న సమాజంలోని ప్రతి అన్యాయం,అక్రమాలపై స్పందించి తనదైన రీతిలో తిరుగు బాటు బావుటా ఎగిరేసే వాడనీ మనందరికీ తెలుసు. ఆ ఆందోళనలో ప్రత్యక్షంగానో ,పరోక్షంగానో ,కవిత్వంగానో తన పాత్రను నిర్విఘ్నంగ,నిర్భయంగ కొనసాగించిన ఘనత కాళోజిది.
అట్లాంటీ ఘనత వహించిన గడ్డపై జన్మించిన మనం ప్రస్తుతం మన ముందు 36రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ అపరిష్క్రత తమస్యల సాధనకై ఉప్పిడి ఉపాసాలుండి సమ్మె చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే.
కాళోజీ ఆశయాల కొనసాగింపులో భాగంగా సమ్మె విషయంలో కవులు,కళాకారులుగ కార్మికలోకానికి నైతిక మద్దతు ప్రకటిద్దాం!ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేద్దాం.
మనలో కలిగిన స్పందనలను కవితగానో ,పాటగానో ,నినాదంగానో గానం చేద్దాం రండి.
ఆర్టీసీ ఉద్యమ శిబిరం.ఏకశిలా పార్కు.బాలసముద్రం.హన్మకొండ. తేది.10-11-2019.ఆదివారం .ఉదయం 11 గంటల నుండి.