రోడ్లకు ఒక కవి నమస్కారం అన్నారు. అవును నమస్కరించాల్సిందే. ఎందుకంటే , రోడ్డు నాగరికతకు చిహ్నం.అయితే మన రోడ్లు నాగరికతకే కాదు, అనాగరికతకు, ప్రమాదాలకు,ప్రమోదాలకీ కూడా కూడళ్లు.
రోడ్ల మీద గతుకులెంత సహజమో హాస్యమూ అంతా సహజం. గతుకులున్నాయని రోడ్డుకే కళ్లప్పగించి నడుచుకూంటూ మీదారిన మీరు వెళ్లిపోతే… చాలా కోల్పోతారు. ముఖ్యంగా ఇలాంటివి… ఈ రోజుకిలా సరదాగా నవ్వుకోండి….