మనం తింటున్న శాకాహారంలో అన్నింటి కంటే చిత్రమైంది అలుగడ్డ. అలుగడ్డ లేకుండా ప్రపంచ నడవ లేదు. ప్రపంచంలోని ప్రతి కిచెన్ ను ఆక్రమించిన వెజిటబుల్ ఆలుగడ్డ. నిజానికి ఈ కూరగాయ తెలుగువాళ్లదసలు కాదు, భారతీయం కూడా కాదు. కాని తెలుగు వంటకాలకు వన్నెచిన్నెలు తెచ్చింది అలుగడ్డే.
ఎక్కడో లాటిన్ఆమెరికా నుంచి వచ్చి ఇంతగా మన ఆహారంలో భాగమయిపోయిందీ దుంప. ఆలుగడ్డ లేకుండా దినం గడవని పరిస్థితి వచ్చేసింది.
ఆలుగడ్డతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చోచెప్పలేం. ఆలుగడ్డ వేపుడు, ఆలుగడ్డ మసాల, ఆలువంకాయ కూర, ఆలు బఠాణీ, ఆలు మటన్, ఆలు చికెన్, ఆలుబోండా, ఆలు బజ్జీ, చిప్స్, ఉప్మాలో ఆలుగడ్డలు, బిరియానిలో ఆలుగడ్డలు, పెరుగు చట్నీలో ఆలుగడ్డలు, ఆలూ కూర్మా, అలూ పనీర్….. ఇలా లెక్కలేన్ని కూరలు. ఇవికాక అమెరికా నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ మరొక వెరైటీ మన మీద దాడిచేస్తూ ఉంది.
ఆలుగడ్డ కూరగాయలు జాబితాలో కనిపిస్తుంది. కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదన్నపుడు ఆలుగడ్డ తింటే ఆరోగ్యానికి మేలు జరగాలి.
ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని రోజు డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు ఎందుకంత పోరుపెడుతుంటారు?
ఈ మధ్య హెల్త్ గోల ఎక్కువయిపోవడంతో మేలు చేసే విజిటబుల్స్ జాబితాలో అలుగడ్డ అడుగునపడిపోయింది.
ఇంతకీ ఆలుగడ్డ సంగతేంటి. తింటే నష్టమా, లాభమా? ఆలుగడ్డని ఇన్ని రకాలుగా భుజించడం వల్ల మేలాకీడా? మేలూ జరగుతుంది? కీడు జరుగుతుంది. అదే ఆలుగడ్డ ప్రత్యేకత.
ఈ మధ్య ప్రపంపమంతా గుండెసంబంధమమయిన జబ్బులు ఎక్కువుతూ ఉండటంటో ఆలుగడ్డ బాగా అపకీర్తిపాలవుతూ ఉంది.
హార్వర్డ్ ఎపిడిమియాలజీ అండ్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ ఎరిక్ రిమ్ ఆలుగడ్డ అతిగా తినేవవాళ్లకు ఒక హెచ్చరిక చేశారు. అలుగడ్డని ఆయన స్టార్చ్ బాంబ్ అనేశారు.
అమాయకంగా కనిపించే ఆలుగడ్డని నీళ్లలో శుభ్రంగా కడిగి, పైపొట్టు తీసేసి, పొడవాటి ముక్కలుగా తరిగి, బాగా కాగిన నూనేలో బంగారు వర్ణం వచ్చే దాకా నెమ్మదిగా వేగించి, అపైన వాటిని బయటకు తీసి తగినంత ఉప్పు, కారం పొడి లేదామిరియాల పొడిచల్లుకుని చీజ్ లో లేదా టొమాటో సాస్ లో ముంచి తింటుంటే ధ్రిల్లింగ్ గా ఉంటుంది.
అయితే, మీరు తింటున్నది అమయాకపు అలుగడ్డ ని కాదు, స్టార్చ్ బాంబ్. మీ ఆరోగ్యాన్ని ధ్వంసం చేసే మారణాయుధం అని ప్రొఫెసర్ రిమ్ అంటున్నారు.
ఈశాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, ఆలుగడ్డల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే వొళ్లు బరువెక్కుతుంది, మధుమేహం వస్తుంది, ఆపై గుండెసంబంధమయిన జబ్బులొచ్చే అవకాశమెక్కువని ఈ పరిశోధన పత్రం చెబుతూ ఉంది.
ఈ పరిశోధనలో చాలా ఆందోళనాకరమయిన విషయాలు వెల్లడయ్యాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవాళ్ల ఆయుష్సు తగ్గిపోతుందని వాళ్ల సర్వేలోతేలింది. ఇందులో ఫ్రైడ్ చేయనివి తినేవారిలో పరిస్థితి కొంతమెరుగు. చెప్పొచ్చేదేమంటే చిప్స్, ఫింగర్ చిప్స్ , ఫ్రెంచ్ ఫ్రైస్ (ఫింగర్ చిప్స్ , ఫ్రెంచ్ ఫ్రైస్ రెండూ ఒకటే గాని, చాలా స్వల్పంగా తేడా ఉంటుంది.) యమడేంజర్ జోన్ లోకిపడిపోతారనే.
ఈ మధ్య అమెరికా వాళ్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తెగ తినేస్తుండటం పట్ల ఈ రీసెర్చ్ పేపర్ రాసిన డాక్టర్ నికోలా వెరొనీస్ అవాక్కయ్యారు.
మామూలుగా ఆమెరికావాళ్ల పొటాటోస్ తెగ తినేస్తారు. అందులో ఎక్కువ భాగమే ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తింటారు. ఒక్కొక్క అమెరికన్ ఏడాదికి 115.6 పౌండ్ల (52.43 kg) అలుగడ్డలు తింటే, అందులో మూడింట రెండు వంతులు ఫ్రెంచ్ ఫ్రైస్ , చిప్స్ , ఫ్రోజెన్ పొటాటో ఫుడ్ ప్రాడక్ట్స్ రూపంలో లాగించేస్తున్నారు. ఇది బాగా చెడ్డ అలవాటు అని ప్రొఫెసర్ రిమ్ వాపోతున్నారు. ఈ మధ్య మెక్ డొనాల్డ్ వాళ్లు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినే అలవాటును ప్రపంచానికంతా పట్టించేస్తున్నారు. నిజానికి,సైడున ఏదయిన శాలడ్ తీసుకుని ఆరు ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల కంటే ఎక్కువ తినడం మంచిదికాదని ఫ్రొఫెసర్ రిమ్ అభిప్రాయం.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో వచ్చిన పరిశోధనా పత్రంప్రకారం అమెరికా లో ఆలుగడ్డలు తినే అలవాటు తగ్గిపోతూఉంది.
అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ వంటి ప్రాసెస్డ్ పొటాటో స్నాక్స్ తినడం బాగా పెరిగింది.ఇదే డేంజర్, ఆయుష్షును తగ్గించే అలవాటిదే అంటున్నారు వారు.
పొటాటో లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ గా ఉన్నమాట నిజమే, దీని వల్ల హృదయ సంబంధ జబ్బులొస్తున్నమాట నిజమే.కాని, పొటాటోలో కొన్ని మంచి లక్షణాలున్నాయి.
గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మీరు తిన్న ఆహారం ఎంత తొందరగా రక్తంలో షుగర్స్ మోతాదు పెంచుతుందనే కొలమానం.
కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఇతర ఆహారంతో పోలిస్తే పొటాటోలో క్యాలరీస్ బాగా తక్కువ. కారణం ఇందులో నీటి శాతం బాగా ఎక్కువ. దీనికితోడు, పొటాటో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ని శరీరానికి అందిస్తుంది. రోగకారకాలను తగ్గిస్తుంది.దీని వల్ల ఆయుష్సు పెరుగుతుంది. అందుకే అలుగడ్డ చిత్రమయిన కూరగాయగా తయారయింది. దీని వల్ల మేలుజరుగుతుంది. కీడు జరుగుతుంది.అందుకే జాగ్రత్త గా తినండి. ఎందుకంట కీడే ఎక్కువ. మిలమిలాడే చిప్స్ గాని, ఫ్రెంచ్ ఫ్రైస్ ని చూసినపుడు నోరూరకుండా ఉండదు. తినకుండా ఉండలేం. ఆలు లేని కూరలు నోటికిరుచించడంకష్టం. కాబట్టి మితం పాటించడం చాలా చాలా అవసరం.