మిలియన్ మార్చ్ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు పోలీసులు ఎంత నిర్భంధాన్ని ప్రయోగించినా కార్మికులు ట్యాంక్ బండ్ కు రాకుండా అడ్డుకోలేకపోయారు.
వందలాది మంది కార్మికులు,ముఖ్యంగా మహిళా ఉద్యోగిణులు ట్యాంక్‌బండ్‌కు పోటెత్తారు. కేసీఆర్‌కు డౌన్ డౌప్ అంటూ ముఖ్యంత్రికి వ్యతిరేకంగా నినాదిలిచ్చారు.
అయితే, ఈ కార్యక్రమంలో ఇలా వేలాదిగా మహిళలు పాల్గొనడం మహిళలను ఇబ్బంది పెట్టింది. మహిళలను టార్గెట్ చేశారు. మహిళా పోలీసులు లేకుండా, మహిళలను నెట్టేస్తూ అరెస్ట్ చేశారు.
ఓ మహిళా కార్మికురాలిపై సీఐ కిషోర్ తీవ్రంగా దాడిచేశాడని. దాంతో ఆ కార్మికురాలి కంటి నుండి తీవ్ర రక్తస్రావం అయి కింది పడిపోయిందని వారు ఆరోపిస్తున్నారు.
మీరంతా ఇక్కడి నుండి వెళ్లండి లేదంటే అందరికీ ఇదే పరిస్థితి అంటూ మిగతా మహిళలను హెచ్చరించాడని వారు చెబుతున్నారు.
సాటి మహిళా కార్మికులు ప్రతిఘటిస్తున్నా సీఐ కిషోర్ దురుసుగా ప్రవర్నించడం, దుర్భాషలాడటంపై మాట్లాడటంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని పోలీసులు దాడులు చేసినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇంతకు ఇంత కేసీఆర్ అనుభవించక తప్పదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పలువురు మహిళా కార్మికులు.కేపి