దళితుడి వీర గాథ ఈనెల 24న విడుదల విడుదల

దళిత హక్కుల సాధన పోరాట  వాస్తవాలను ‘ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ’ పేరుతో  తన జీవితాన్ని కథగామలచి,  72 వ రచన గా  ప్రముఖ దళిత కవి తాత్వికుడు కత్తి పద్మారావు తీసుకువస్తున్నారు.
ఈ పుస్తకావిష్కరణకు సంబంధించిన పుస్తక మహోత్సవ కరపత్రాన్ని ఆయన ఈ రోజు  విజయవాడ ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. ఇది తన కథకాదని, భారతీయ సమాజంలో దళితలనబడే ప్రతిఒక్క ఆత్మకథ అని ఆయన అన్నారు.
ఈ ఈ పుస్తకాన్ని డాక్టర్ బాబాా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్  ఈ నెల 24 వతేదీన  విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించనున్నారు.
1985 సంవత్సరానికి ముందు దళితుల తరువాత స్థితిగతులకు ఈపుస్తకం  అద్దం పడుతుందని ఆయన అన్నారు.
గతంలో జరిగిన కారంచేడు, చుండూరు దుర్ఘటనలతో   వివిధ బడుగు, బలహీన కులాల వారంతా దళితులు గా విశ్వ విఖ్యాతి చెందడం ఒక గొప్ప తాత్విక పరిణామం అని ఆయన అన్నారు.
1989 లో జరిగిన దళిత మహాసభ అస్పృశ్యత పై విజయం సాధించిందని చెబుతూ  పార్లమెంట్ లో 1989 ఎస్సీ, ఎస్ టి ఎట్రా సిటీ చట్టం ఆవిర్భవించడం అస్పృశ్యత మీద  దళిత సమాజం సాధించిన ఒక విజయం గా పద్మారావు అభివర్ణించారు.
ఈ పుస్తకం అట్టచివర ఆయన ఇలా రాసుకున్నారు.
‘ఒక అస్పృశ్యుని యుద్ధగాథ. ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు. భారతదేశంలో అస్పృశ్యతకు గురై యుద్ధవీరులుగా మారి విజయపతాకలు ఎగరవేసిన వారి చరిత్రే. జీవితమంటే యుద్ధమే. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, తాత్విక, రాజకీయ అణచివేతలను అధిగమిస్తూ ఆత్మగౌరవాన్ని ప్రకటించిన చారిత్రకగాథ ఇది. ఈ కథలో సామాజిక జీవన చిత్రాలు ఉంటాయి. సాంస్కృతిక ఉజ్వల ప్రభాసమాన కదన రంగాలు ఉంటాయి. అక్షరాల్ని ఆకాశ నక్షతారలుగా వెలిగించిన దివ్వెలు ఉంటాయి. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, కాంట్, హెగెల్, మార్క్స, అంబేడ్కర్, మహోత్మాఫూలే, పెరియార్, జాషువా, భట్టుమూర్తి వంటి ఎందరో వ్యక్తిత్వాల నుండి సంతరించుకున్న వ్యక్తిత్వ చిత్రమూ కనిపిస్తుంది. ఈ యుద్ధకౌశల్యాన్ని నేర్చుకుందాం… విజేతలుగా నిలబడదాం.’