సోనియా కుటుంబానికి ఎస్ పి జి భద్రత ఉపసంహరణ

రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్ పిజి) భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహిరించుకుంటూ ఉంది.
ఇక ముందుకు ఈ కుటుంబంలోని సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు జడ్ ప్లస్ (Z+ ) సెక్యూరిటీ భద్రత మాత్రమే ఉంటుంది. జడ్ ప్లస్ లో సెంట్రల్ రిజర్వు పోలీసు బలగానికి (సిఆర్ పిఎఫ్) కి చెందిన కమెండోలు ఉంటారు.  కేంద్రం నిర్ణయం రాగానే  సోనియాగాంధీ కుటుంబానికి ఈ కమెండోల భద్రత మొదలవుతుంది.ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఎస్ పి  జి సెక్యూరిటీ తగ్గించి జడ్ ప్లస్ సెక్యూరిటీ అందిస్తున్నారు.
ఇకనుంచి ఒక ప్రధాని నరేంద్రమోదికి మాత్రమే ఎస్ పి జి భద్రత ఉంటుంది. ప్రధాని రక్షణ కోసం ఒక ప్రత్యేక భద్రతా దళం అవసరమని భావించి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తర్వాత ఎస్ పి జి ని 1985లో ఏర్పాటు చేశారు. ఆమెను సొంత అంగరక్షకులే హతమార్చడంతో ప్రధాని భద్రతకు ఒక ప్రత్యేక దళం అవసరమని భావించి  ఎస్ పిజిని ఏర్పాటు చేశారు.
మూడు వేల మంది సిబ్బందితో ఉండే ఈ ప్రత్యేక దళం ప్రధాని భద్రతతో పాటు మాజీ ప్రధానుకుటుంబానికి, వారి కుటుంబ సభ్యుల భద్రత కల్పించేది.
అయితే, మాజీ ప్రధానులకు కల్పించే విషయాన్ని పదవి నుంచి దిగపోయిన ఏడాది తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
తర్వాత సంవత్సరానికొక సమీక్ష ఉంటుంది. రాహుల్ గాంధీ కుటుంబానికి భద్రత అవసరమని భావిచండంతో ఇప్పటికదా ఎస్ పిజి భద్రత కల్పిస్తూ వచ్చారు.
ఎస్ పిజి చట్టం తీసుకువచ్చిన కొత్తలో మాజీ ప్రధానికి ఒక ఏడాది మాత్రమే భద్రత కల్పించాల్సి ఉండింది.1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎస్ సి జి చట్టాన్ని సవరించి అధికారం నుంచి దిగిపోయాక మాజీ ప్రధానికి కుటుంబ సభ్యులకు పదేళ్ల దాకా ఎస్ పి జి భద్రత కల్పించాలని నిర్ణయించారు.
అయితే, వాజ్ పేయి ప్రధాని అయ్యాక ఎస్ పిజి భద్రతను సమీక్షించి మాజీ ప్రధానులైన పివి నరసింహారావు, హెచ్ డి దెవేగౌడ, ఐకె గుజ్రాల్ లకు ఈ భద్రత తొలగించారు.
2003లో మరొక సారి చట్టాన్ని సవరించి ప్రధాని పదవి నుంచి దిగిపోయాక మాజీప్రధానికి, ఆయన కుటుంబానికి ఒక ఏడాది పాటు మాత్రం ఎస్ పిజి భద్రతకల్పించాలని నిర్ణయించారు.
అయితే, 2004లో  ప్రధానిగా వాజ్ పేయి దిగిపోయినా ఆయన 2018లో మరణించే దాకా ఎస్ పిజి భద్రత కొనసాగింది.
ఒక ఏడాది కంట ఎక్కువ కాలం భద్రత అవసరమనేదాని మీద ఆకుటుంబానికి ఉన్న ముప్పు ను బట్టి నిర్ణయిస్తారు. ఇందులో కూడా ఈకుటుంబానికి తీవ్రవాదలునుంచి ముప్పు ఉన్నదా లేక ఇతర శక్తులనుంచి ముప్పు ఉన్నాదా అనే విషయాన్ని కూడా కేంద్రం పరిగనణలోనికి తీసుకుంటుంది.
అయితే  ఈ నిర్ణయాన్ని కక్ష సాధింపు చర్య అని  కాంగ్రెస్ వర్ణిస్తూ ఉంది. తీవ్రవాదులు బలిగొన్న ఇద్దరుజాతీయనేతలున్నకుటుంబాన్ని ఇలా చూడడం సరికాదని పార్టీ నేత అహ్మద్ పటేల్ ట్టిట్టర్ లో పేర్కొన్నారు.

 

PM Modi with SPG cover Photo source spg.nic.in