ఆంధ్ర ప్రదేశ్ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో అధికార నివాసాల మీద ఎంత ఖర్చు చేశారో లేక్కేలేదు. ఆయన ఖర్చు ఎపుడూ హెడ్ లైన్స్ లో ఉండేది. వైసిపి దాని మీద పెద్ద క్యాంపెయిన్ నిర్వహించింది.
ఇపుడు వైసిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదేబాటలో నడుస్తున్నారు.
ఆయన పెడుతున్న ఖర్చు చూస్తే ఏకంగా కొత్త బంగాళా కట్టుకోవచ్చు. తెలుగుదేశం ముఖ్యమంత్రి అవినీతిని మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రలో ఎండగట్టి ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి దుబారా ఎవరూ వూహించరు.
ఆయన చంద్రబాబు కంటే భిన్నంగా ఉంటారని, సింపుల్ గా ఉండి దేశానికి ఆదర్శమవుతారని చాలా మంది ఆశపడ్డారు.
ఆయనకు చాలా వయసు ఉంది కాబట్టి ఆయన అన్ని రకాలుగా ఖర్చులు తగ్గించి ప్రజలు డబ్బు ఆదాచేసి విలాసవంతంగా ఆదర్శ ప్రాయంగా ఉంటారని అనుకున్నారు.
ఇపుడు ఆయన కొంగ్రొత్త ఇంటి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది చూస్తే ఇది ఇది నిజామా అనిపిస్తుంది. ఇపుడు వైసిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇళ్ల గురించి తీవ్రమయిన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొత్తంగా నాలుగు క్యాంపు ఆఫీసులు మెయింటెయిన్ చేసి అక్కడ సెక్యూరిటీ పేరుతో రు.80 కోట్లు ఖర్చ చేశారని టైమ్సాఫ్ ఇండియా కూడా రాసింది.
అయిదు నెలల కిందట అమరావతి సమీపంలోని తాడేపల్లిలో కట్టిన కొత్త ఇల్లు కూడా ఇలా గే ముస్తాబవుతూ ఉంది.
ఈ కొత్త ఇంటికి అల్యూమినియ్ కింటి ఫ్రేమ్,తలుపులు బిగించడం తదితర చిల్లరమల్లర రిపేరక్ల చేసేందుకురు.73 లక్షల విడుదల చేశారు.
ఆయింటికి ఇంతకు ముందు అల్యూమినియం కిటీలు లేవా?తలుపులు లేవా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందుకంటే జగన్ నివస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లి ఇల్లు బ్రాండ్ న్యూ బంగళా. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాలుపొంగించారు. అపుడాయన ప్రతిపక్షనాయకుడు. తర్వాత మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, ఇపుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కొత్త మార్పులు చే ర్పులు చేసి సెక్యూరిటీ పేరుతో హంగులు దిద్దుతున్నారు.
లగ్జీరీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కు పేరుంది. ఆయన ఖర్చులు అలా ఉంటాయి. హైదరాబాద్ లో ఆయనకు లేక్ వ్యూ గెస్టు హౌన్ కేటాయించారు.దానిని మీద ఆయన కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ ఉండలేదు. సెక్రెటేరియట్ కార్యాలయానికి కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ ఉండలేదు. తర్వాత సొంత పామ్ హౌస్ నుంచి ఆయన అధికారం పాలన చలాయించారు.అక్కడ సెక్యూరిటీ పేరుతో ఖర్చు పెట్టారు. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ కు మారారు. తెలుగు ముఖ్యమంత్రుల్లా విలాసవంతంగా జీవించే ముఖ్యమంత్రులు లేరంటారు. ఎందుకంటే, చాలా రాష్ట్రాలలోముఖ్యమంత్రులు చాాలా సింపుల్ ఉంటారు. ఆశ్చర్యం చంద్ర బాబు వేసిన దుబారా బాటలోనే జగన్ నడుస్తున్నారు.
జగన్ కొత్త ఇంటి కిటికీలు, డోర్లకు ఆర్ అండ్ బి శాఖ అక్టోబర్ 15న ఈ రు.73లక్షలను విడుదల చేసింది.
ఈ ఇంటిని ముఖ్యమంత్రికి నివాసయోగ్యం చేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ హెలిపాడ్, ఇతర వసతులు కల్పించేందుకు జూన్ 26 వ తేదీన (జివొ ఎమ్ ఆర్ టి నెం.133) రు.1.89 కోట్ల విడుదల చేశారు.
ఇందులో రు. 46 లక్షలు హెలిపాడ్, కంచె నిర్మాణానికి,75లక్షలు శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని బారికేడ్ చేసేందుకు, రు. 30 లక్షలు పోలీస్ బ్యారక్ టాయిలెట్ బ్లాక్ కోసం,మరొక 31 లక్షలు సెక్యూరిటీ షెల్టర్, గేట్ల కోసం, రు.13.50 లక్షలు గార్డ్ రూం, టాయిల్ బ్లాక్ కోసం ఖర్చు చేశారు.
జూన్ 25 వ తేదీన రు. 5 కోట్లు విడుల చేశారు. ఈ నిధులతో రేవేంద్ర పాడు, సీతానగరం రోడ్డు కి.మీ 7.400 నుంచి 8.700 దాకా ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలకు అనుగుణంగ మరమ్మతు చేశారు.
జూలై 12న రు. 3.63 కోట్లతో సిఎం క్యాంప్ ఆఫీస్, రెసిడెన్స్ కరెంటు పనులు చేపట్టారు.
ఇక ఇటీవల అక్టోబర్ 31, మరొక రు.3.35 కోట్లకు ఆర్ అండ్ బి శాఖ జివొ ఆర్ టి నెం 270 అడ్మినిష్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేసింది. తాడే పల్లిలో సర్వే నెంబర్లు 88,102-2బిలో 0.148 ఎకరాలకు నష్టపరిహారంగా చెల్లించారు. ఇది కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన వసతులు కల్పనకోసం తీసుకున్న భూమియే.ఈ జివొ నంబర్లు కిందచూడవచ్చు. ఇవన్నీ నెట్ లో లభ్యమవుతాయిన
ఇది ఇలా ఉంటే, ఇటీవల ముఖ్యమంత్రిజగన్ సిబిఐ కోర్టులో రాష్ట్ర పతి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని, అందువల్ల తాను ప్రతిశుక్రవారం కోర్టు కు రావడంవల్ల ఖజానామీద భారం పడుతుందని చెబుతూ వ్యక్తిగత హాజరి నుంచి తనకు మినహాఇంపు ఇవ్వాలని కోరినసంగతి తెలిసిందే.