ఆంధ్రప్రదేశ్ ఆదాయం బాగా తగ్గు ముఖం పట్టినప్పటికి మద్యాన్ని నియంత్రించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అధికారులను ఆదేేశించారు. ఈ రోజు ఆయన రాష్ట్ర ప్రభుత్వాదాయాన్ని సమీక్షించారు.చాలా రంగాలలో గణనీయంగా రెవిన్యూ పడిపోయింది. మద్యం దుకాణాలను తగ్గించడం వల్ల రాబడి బాగతగ్గిందని అధికారులు చెప్పినపుడు పర్వాలేదు, మద్యాన్ని నియంత్రించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించాలనుకుకోవడం వల్ల గతంలో లైసెన్సుల రూపంలో వస్తున్న భారీ ఆదాయం తగ్గింది. అయినా వెరవకుండా ఆయన అంచెంచెలుగా మద్యనిషేధం అమలుచేసేందుకు నిర్ణయించడం విశేషం.
ఆదాయం చిక్కిపోతున్నఆందోళన ఆయన వ్యక్తం చేయకపోవడం, దానికి తోడు దేవుడు మనతో ఉన్నాడు, ముందుకుసాగండనడపట్ల కొంది మంది అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఒక్క వాణిజ్యపన్నుల శాఖ లో తప్ప మిగతా రంగాలలో రాబడి పెరగకపోవడం కాదు తగ్గింది.
గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల్లో 0.14శాతం వృద్ధి గత ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.24,947 కోట్లు కాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.24,982 కోట్లు.
ఆదాయం పడిపోయిన శాఖలు
– ఎక్సైజ్ శాఖలో 8.91 శాతం తగ్గిన ఆదాయం. ఎక్సైజ్ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.4043.72 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ. 3683.25 కోట్లు
– స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 3.26 శాతం ఆదాయం పెరుగుదల. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.2804.67 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అక్టోబరు వరకు రూ. 2895.96 కోట్ల ఆదాయం
– రవాణా శాఖలో 6.83 శాతం తగ్గిన ఆదాయం. రవాణా శాఖలో గత ఏడాది అక్టోబరు వరకు రూ.2116.49 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1971.91 కోట్లు
– గనులు, భూగర్భ వనరుల శాఖలో గణనీయంగా 19 శాతం తగ్గిన ఆదాయం. గనులు, భూగర్భ వనరుల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.1258 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1023 కోట్లు మాత్రమే
– ల్యాండ్ రెవెన్యూ శాఖలోనూ తగ్గిన ఆదాయం. గత ఏడాది కంటే 23.49 శాతం తగ్గుదల. ల్యాండ్ రెవెన్యూ శాఖలో గత సంవత్సరం అక్టోబరు వరకు రూ.109.66 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.83.9 కోట్లు
– అటవీ శాఖలో 78.03 శాతం తగ్గిన ఆదాయం. అటవీ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.131.69 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.29.94 కోట్లు మాత్రమే
– అన్ని శాఖల నుంచి గత ఏడాది అక్టోబరు వరకు మొత్తం రూ.35,411.23 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు 2.10 శాతం తగ్గి ఆదాయం రూ.34,669.35 కోట్లుకు పడిపోయింది.
– రవాణా శాఖ ఆదాయంలో మొదటి, రెండవ త్రైమాసికంలో మైనస్ 11.81 శాతం, మైనస్ 12.42 శాతం కాగా, అక్టోబరులో పెరుగుదల 15.4 శాతం నమోదైంది. అయినప్పటికీ రవాణా శాఖలో మొత్తం మీద ఆదాయం తగ్గి మైనస్ 6.83 శాతం వృద్ధి రేటు నమోదైంది.
ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని ఆదేేశించారు.ఏసీ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయత్నించాలని,ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని సూచించారు.
– ఆర్థిక వ్యవస్థ మందగమనం (స్లోడౌన్)లో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నాం వ్యాఖ్యానించారు. ఇది సానుకూలం, దేవుడు మనతో ఉన్నాడని అన్నారు.
మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం వల్ల లైసెన్సు ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా, మద్యాన్ని నియంత్రించాల్సిందే అని స్పష్టం చేశారు.
మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశాలు
దీన్ని జనవరి 1 నుంచి తగ్గింపు అమల్లోకి తీసుకురావాలని ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని ఆయన చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని హెచ్చరించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.