Skip to content తెలంగాణలో ప్రజలు రెవిన్యూ వాళ్ల మీద ఎంతో కసితో ఉన్నారంటే, అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో సజీవదహనం కేసు సమస్య పరిష్కారానికి దారి చూపిందని అనుకుంటున్నారు.
ఒక దురదృష్టకరమయిన సంఘటన ఇలాంటి పరిణామం తీసుకురావడమంటే రెవిన్యూ శాఖ ఎంతకుళ్లిపోయి ఉందో అర్థమవుతుంది.
అందుకే ఒక రైతు తన డాక్యుమెంట్ మీద ఎందుకు సంతకం చేయరని ఏకంగా పెట్రోల్ సీసా తీసుకుని ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చారు.
ఈ సంఘటన మహుబాబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గంలో ని (మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి రెడ్యా నాయక్ నియోజకవర్గం.) మరిపెడ మండల MRO ఆఫీసులో జరిగింది.
పెట్రోల్ బాటిల్ తో ఒక పేద రైతు హల్ చల్ చూడండి.
పట్టణాల్లో ఉన్నవాళ్లకి తెలియదు గాని, గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మార్వో కార్యాలయం సతాయింపులు అంతా ఇంతాకాదు.
రెవిన్యూ డిపార్ట్మెంట్ ను ఎత్తేస్తామని ఆ మధ్య ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనతో ఇక పీడ విరగడ అవుతుందని అంతా బావించారు.
అయితే, ఇది సమస్య పరిష్కారమా అనేది అనుమానమే. అవినీతి ఇంకోరూపం తీసుకుంటుంది.
అయినా సరే జనం కెసిఆర్ కు చప్పట్లు కొట్టారు.
అందుకే విజయారెడ్డి హత్య తెలంగాణ సమాజంలో రెవిన్యూ వాళ్ల అవినీతిని పెద్ద చర్చనీయాంశం చేసింది.