లంచం గురించి అడగడంతో ధర్నానుంచి లేచిపోయిన రెవిన్యూ సిబ్బంది

ఈ రోజు ఒక ఎమ్మార్వో ఆఫీసులోని  రెవిన్యూ సిబ్బంది నిన్న జరిగిన ఎమ్మార్వో సజీవదహనం మీద నిరసన తెలుపుతూ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.
అక్కడికి ఒక మహిళ, ఒకపురుషుడు వచ్చి మీరెందుకు లంచాలు తీసుకుంటారని నిలదీశారు.
తన దగ్గిర నుంచి తీసుకున్న రెండువేల రుపాయలను వెనక్కి వ్వాలని మహిళ నిలదీశారు.
ఎమ్మార్వో ఆఫీసు వాళ్ల కు నోట మాట రాలేదు. విషాదసమయంలో ఇలా కడిగేస్తుంటే ధర్నా వదిలి లేచి వెళ్లి పోయారు.
ఒక సామాన్యమహిళ ఒకడికిచ్చిన 2000.రూ.ల లంచం తిరిగిచ్చెయ్యమని అడిగినందుకు అందరిభాగోతాలూ బైటపెడతాదేమోనని భయమేసి ధర్నాచేసేవాళ్ళు లేచి పారిపోయారు.  అంతమంది అవినీతిపరులు ఆఫ్టరాల్ ఒక సామాన్య మహిళకు భయపడి పారిపోయారు. ఈ రోజు రెవిన్యూ వాళ్ల  ధర్నా ఎంత సిన్సియరో చూడండి.
రెవిన్యూ డిపార్ట్ మెంట్ అంటే ప్రజల్లో ఎవరికీ సానుభూతి లేదు. వాళ్లంత అవినీతి పరులెవరూ ఉండరని వాళ్ల తర్వాతే మిగతా ఎవరైనా అనేది జనాభిప్రాయం.
క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గిర నుంచి రైతు పాస్ బుక్ దాకా వాళ్లెంత సతాయిస్తారో అందరికి తెలిసిందే. తమ దగ్గిర కొచ్చేవాళ్లని ముఖ్యంగా పేద వాళ్లని  వాళ్లు పురుగుల్లా చూస్తారు. అసలు వాళ్లు రోజూ ఆఫీసుకొచ్చేది దండుకునేందుకే నని ప్రజల్లోఒక బలమయిన నమ్మకం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  రెవిన్యూ వాళ్లని మోస్ట్ కరప్ట్ అన్నపుడు వాళ్ల అసోసియేన్లు తప్ప మరొకరు విచారం వ్యక్తం చేయలేదు.
ఎందుకు?
ఆయన అంటున్నది రోజూ చూస్తున్నదే. దీనితో ఒకటి రెండు ఎమ్మార్వో ఆఫీసులు ‘ఇక్కడ లంచం తీసుకోబడదు’ అని బోర్డు తగిలించాయి. గుమ్మడి కాయల దొంగల్లాగ భుజాలు తడుముకోవడం ఏమిటి? ఇదొక పెద్ద జోక్ అయింది.
ఈ వీడియో రెవిన్యూవాళ్ల అవినీతి బాధితురాలు కడపుమంటతో   ఇలా నిలదీస్తుంటేఅక్కడ చూస్తున్న వాళ్లంతా ‘చెప్పనీయండ’ని ఎంకరేజ్ చేయడం వీడియోలో వినవచ్చు.
ఇదెక్కడో తెలియదు గాని, ఈ రోజు వైరలయింది.