కర్తార్ పూర్ కారిడార్ మీద పాకిస్తాన్ ఒక పాట విడుదల చేసింది. శాంతి, ప్రేమ, మత సామరస్యం సందేశంతో ఉన్న ఈ పాటని మంగళ వారం నాడు రాజధాని ఇస్లామాబాద్ లో ఒక ప్రత్యేక కార్యకమ్రంలో ఈ పాట విడుదల చేశారని ప్రధాని ప్రసార సమాచార సలహాదారు ఫిర్ దస్ ఆషిక్ అవన్ తెలిపారు.
కర్తార్ పూర్ కారిడాన్ తెరవడమనేది మైనారిటీలకుభద్రత కల్పించాలన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దార్శనికతకు నిదర్శనమని ఆవన్ పేర్కొన్నారు. ఈ కారిడాన్ ప్రారంభంతో శాంతి, మత సామరస్యం పెరుగుతాయని ప్రధాని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వచ్చేశనివారం నాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారిడార్ ను ప్రారంభిస్తారు. పాట ఇస్లామ్ గొప్పతనాన్ని చాటిచెబుతుందని చెబుతూ కర్తార్ పూర్ కు శిక్కు ప్రపంచాన్ని పాకిస్తాన్ మనసారా ఆహ్వానిస్తూ ఉందని ప్రధాని అన్నట్లు సలహాదారు చెప్పారు.
డైరెక్టొరేట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్ మీడియా అండ్ పబ్లికేషన్ (ఐ అండ్ బి అండ్ నేషనల్ హెరిటేజ్ శాఖ) ఈ పాట విడుదలకార్యక్రమం నిర్వహించింది.( source Tribune Express)
Govt of #Pakistan 🇵🇰 launches song in connection with the opening of #KartarpurCorridor (1/2)https://t.co/RkBxmRS8fZ pic.twitter.com/W25fbjH3tP
— Radio Pakistan (@RadioPakistan) November 4, 2019
Govt of #Pakistan 🇵🇰 launches song in connection with the opening of #KartarpurCorridor (2/2)https://t.co/RkBxmRS8fZ pic.twitter.com/utIy9kjlG9
— Radio Pakistan (@RadioPakistan) November 4, 2019