ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టుడయిన ఐఎఎస్ ఆఫీసర్ , జిఎడి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు ప్రధానికార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం షోా కాజ్ నోటీసు ఇచ్చారో లేదా, ఆయనే మూట ముల్లె సర్దుకోవలిసింది.
జిఎడి కి బాస్ చీఫ్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యం. ప్రవీణ్ ప్రకాశ్ సిఎస్ కు సబార్డినేట్. షోకాజ్ నోటీ సు సమాధానం చెప్పుకోవలసిన ప్రవీణ్ ప్రకాశే చీఫ్ సెక్రెటరీ ని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
బాపట్లలో ఉన్న ఎపి హ్యూమన్ రిసోర్సెస్ డెవెలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ కు సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
అంతేకాదు, వెంటనే సిసిఎల్ ఎ కు చార్జ్ అప్పగించి వెళ్లిపోమన్నారు.
ఒక ప్రధాన కార్యదర్శిని ఇలా తీసేసి హెచ్ ఆర్ డి ఇన్ స్టిట్యూట్ కు పంపడం చాలా అరుదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆనందరావు ని చీఫ్ సెక్రెటరీగా తప్పించి పివి రావును తీసుకువచ్చారు.
నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు శ్రవణ్ కుమార్ ను చీఫ్ సెక్రెటరీ గా తీసేసి మరొరికి రామన్ ని తీసుకువచ్చారు. ఎన్టీఆర్ మళ్లీరాగానే శ్రవణ్ కుమార్ ను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామకృష్ణను తొలగించారు. ఆయన ఢిల్లీ వెళ్లిపోయి సెబిలో సెటిలయ్యారు.
సాధారణంగా ఈ పోస్టుకి సీనియర్ మోస్టు స్పెషల్ చీఫ్ సెక్రటెరీ నియమిస్తారు. అంతేకాని, ఛీఫ్ సెక్రటెరీని తొలిగించి నియమించలేదు. ప్రభుత్వంలో ఏక్కడో ఏదో జరుగుతు ఉందనేందుకు ఇదే నిదర్శనం.
ఈ మధ్య ఎల్ వి సుబ్రహ్మణ్యానికి ప్రభుత్వానికి విబేధాలొచ్చాయి. దానితో ఆయనను ముఖ్యమంత్రి జగన్ పెద్ద గా పట్టించుకోవడంలేదని చెబుతారు. దీనితో ప్రవీణ్ ప్రకాశ్ చక్రం తిప్పుతున్నారని వినికిడి.
ఈ మధ్య ప్రవీణ్ ప్రకాశ్ ఎపి అడ్మినిస్ట్రేషన్ లో సూపర్ స్టార్ అయ్యారు. ఆయన డైరెక్టుగా ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత్యం వల్ల ఎనలేని పవర్ వచ్చింది.
ఈమధ్య బిజినెస్ రూల్స్ మారుస్తూ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కు చీఫ్ అయిన చీఫ్ సెక్రటెరీ డమ్మీ ని చేస్తు ఒక ఉత్తర్వులిచ్చారని మీడియాలో బాగా వార్తలొచ్చాయి.
నిజానికి ప్రవీణ్ ప్రకాశ్ (1994) గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా బాగా సన్నిహితులే. ఆయన ఢిల్లీ ఆంధ్ర భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నపుడు నివనిర్మాణదీక్ష సమయంలో చంద్రబాబుకు బాగా ఏర్పాట్లు చేసి ప్రశంసలందుకున్నారు.
ఇపుడాయన ముఖ్యమంత్రి జగన్ కు కూాడా సన్నిహితులయ్యారు. అందుకే జగన్ ఆయనని ఢిల్లీ నుంచి తీసుకువచ్చి జఎడి (పొలిటికల్) కార్యదర్శిగా నియమించుకున్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు కూడా తనకు నివేదికలు పంపాలని, ముఖ్యమంత్రి ఆదేశాలను సకాలంలో అమలుచేయకపోతే, తానే షోకాజ్ నోటీసులిస్తానని ప్రవీణ్ ప్రకాష్ ఉత్వర్వులో పేర్కొనడం పెద్ద సంచలనం సృష్టించింది.
ఇది చాలా వివాదానికి దారి తీసింది. దీనితో ఆగ్రహించిన ఎల్ వి ఆయనకు రెండు రోజుల కిందట తన సబార్డినేట్ అయన ప్రవీణ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇపుడు తానే సెక్రెటేరియట్ ఖాళీ చేసి వెళ్తున్నారు.
గత ప్రభుత్వంలో కూడా ఎల్ వి సుబ్రహ్మణ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో విబేధాలొచ్చాయి. ఈ విబేధాల వల్లే ప్రభుత్వం మారాక చీఫ్ సెక్రెటరీగా ఆయన కొనసాగేందుకు వీలయింది.
తర్వాతి ప్రధాన కార్యదర్శిగా 1984 బ్యాచ్ కు చెందిన నీలమ్ సహనీ, సమీర్ శర్మలలో ఒకరిని సిఎస్ గా నియమించే అవకాశం ఉంది ప్రచారం. అయితే, ఈ బ్యాచ్ వాళ్లంతా ఢిల్లోలో ఉన్నందున వారు తిరిగొచ్చే అవకాశం లేదు.
ఇక మిగిలింది 1986 బ్యాచ్ అధికారులు. ఈ బ్యాచ్ లో ఇపుడు రాష్ట్రంలో ఉన్నది ఇద్దరే.
అందులో ఒకరు డి సాంబశివరావు, మరొకరు సతీష్ చంద్ర. ఇద్దరు చంద్రబాబుకు దగ్గిర కాబట్టి వీరిని నియమించే అవకాశం లేదు.
అందువల్ల నీరబ్ ప్రసాద్ నియమితులయ్యే అకాశాలున్నాయని అంటున్నారు.
ఇపుడు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరభ్ కుమార్ (1987) ని నియమించారు. ఆయన ఇపుడు సీసీఎల్ఏ గాా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.