పవన్ కళ్యాణ్ విశాఖ ఇసుక లాంగ్ మార్చ్ పై విశాఖకే చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఆయన స్పందనలోని విశేషాంశాలు:
ఇసుక పై పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడానికే లాంగ్ మార్చ్ చేస్తున్నాడు
పవన్ కల్యాణ్ రాజకీయ ఉద్దేశాలను గమనించే రాజకీయ పార్టీలన్నీ లాంగ్ మార్చ్ కు దూరంగా వున్నాయి.
పవన్ ప్యాకేజీ రాజకీయాలను అందరూ చీ కొడుతున్నారు.
చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ లాంగ్ మార్చ్ నాటకం ఆడుతున్నాడు.
రాష్ట్రంలో 70 రోజుల నుంచి నదుల్లో వరద కొనసాగుతోంది.
వరదల వల్ల ఇసుక తవ్వకాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
గతంలో చంద్రబాబు సర్కారు ఇసుక దోపిడీని ప్రోత్సహించింది.
ఈ దోపిడీ అరికట్టడానికి సిఎం వైఎస్ జగన్ నూతన ఇసుక పాలసీ తీసుకు వచ్చారు.
తమ ఇసుక దోపిడీకి అవకాశం లేకపోవడాని టిడిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
చంద్రబాబు సొంత కొడుకు లోకేష్ తో గుంటూరు లో నిరసన దీక్ష చేయించాడు. ఇప్పుడు తన దత్తపుత్రుడు పవన్ తో వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేయిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ప్రజలు తిరస్కరించారు
రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు చిత్తుగా ఓడించారు
అయినా పవన్ కు బుద్ది రాలేదు
ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు
లాంగ్ మార్చ్ సముద్రం ఒడ్డున కాకుండా కృష్ణా, గోదావరి నదుల వద్ద చెయ్యండి.
వైసీపీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు కామెంట్స్
చంద్రబాబు డైరెక్షన్ లో రాజకీయ కుట్రతోనే పవన్ లాంగ్ మార్చ్ చేపట్టాడు
ఇసుక కొరత మానవ తప్పిదం అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు కు పవన్ అమ్ముడు పోయాడు.
చంద్రబాబు అయిదేళ్ళు ఇసుక దోపిడీ కి పాల్పడితే ఏ రోజైనా లాంగ్ మార్చ్ చేశాడా?
ఇసుక దోచుకున్న టిడిపి నేతలతో కలిసి పవన్ లాంగ్ మార్చ్ ఎలా చేస్తారు?