విశాఖ పట్నంలో ఇసుక పోరాటం లో భాగంగా ఈ సాయంకాలం జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు వైసీపీకి రెండు వారాల గడువు ఇస్తున్నానని అన్నారు. ‘ వైసిపి ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన ఒక్కో కార్మికుడికి రూ.50 వేలు ఇవ్వాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. రెండు వారాల్లో స్పందించాలి. లేకపోతే అమరావతి వీధుల్లో మార్చ్ చేస్తా. చంద్రబాబు మీద కోపంతో ఇంత మంది ప్రజల్ని శిక్షిస్తారా?. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుంది.’ అని పవన్ హెచ్చరించారు.