హోమీ జహంగీర్ భాబా (పు.తే అక్టోబర్ 30,1909) భారతదేశ న్యూక్లియార్ విధానానికి పునాది వేసిన శాస్త్రవేత్త. ఆయన టాటా కుటుంబానికి చెందిన వాడు. సర్ డోరాబ్జీ టాటా ఆయన మామ అవుతాడు.
18 సంవత్సరాల వయసులోనే ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివేందుకు కేంబ్రిడ్జి యూనివర్శిటీ వెళ్లాడు. అయితే, అక్కడ ఆయన మనసు ఫిజిక్స్ మీదకు మళ్లింది. “ I am burning with a desire to do Physics. I will and must do it some time. I have no ambition to be a ‘successful’ man or head of a big firm” అని ఆయన తన మనసులోని మాటని 1928 లో తండ్రికి లేఖ ద్వార చెప్పి ఫిజిక్స్ లోకి మారారు.
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక విశ్వ విఖ్యాత శాస్త్రవేత్తల దగ్గిన పని చేశారు.
కేంబ్రిడ్జి లోని కెవెండిష్ లాబొరేటరీ లోచేరి పిహెచ్ డి తీసుకున్నారు. తర్వాత జూరిక్ లో వూల్ఫ్ గ్యాంగ్ ఫౌలీ దగ్గిర పని చేశారు. రోమ్ వెళ్లి ఎన్నికో ఫెర్మి దగ్గిర పని చేశారు.
ఆ తర్వాత ఆయన ఎ క్రామెర్స్ (యుట్రెక్ట్), నీల్స్ బోర్ ( కోపెన్ హేగ్ )ల దగ్గిర పనిచేశారు.
1939లో ఇండియాకు తిరిగి వచ్చి బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) లో రీడర్ గా చేరారు. 1942లో ఫ్రొఫెసర్ అయ్యారు.
1945 లో ఆయన బాంబేలో టాటా ఇన్స్ స్టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) స్థాపించారు. తర్వాత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భాభాని ఎటామిక్ ఎనర్జీ కమిషన్ ఛెయిర్మన్ నియమించారు.
తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎటామిక్ ఎనర్జీ కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయంగా ఆయన ప్రతిభకి గుర్తింపు వచ్చింది.
లార్డ్ రెడ్ క్లిఫ్ మాడ్ భాబాని “ He stood out as a world citizen qualified in all three subjects – education, science and culture” అని ప్రశసించారు.
భాబా థియరిటికల్ ఫిజిక్స్ లోనే కాదు, ఎక్స్ పెరిమెంటల్ ఫిజిక్స్ లో కూడా నాటి ప్రపంచంలో మేటి శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు.
అంతర్జాతీయంగా చెబితే, జెనీవాలోని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది పీస్ ఫుల్ యూజెస్ ఆఫ్ ఎటామిక్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అధ్యకుడిగా పనిచేశారు.
1966 జనవరి 24, స్విజర్లాండ్ మౌంట్ బ్లాంక్ శిఖరాల మీద విమానంకూలిన ప్రమాదం ఆయన మరణించారు.
ధియరిటికల్, ఎక్స్ పెరిమెంటల్ ఫిజిక్స్ ల్ ఇంత పేరు తెచ్చుకున్నా హోమీ భాభాకు నోబెల్ ప్రైజ్ రాకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనే ప్రశ్న వస్తుంది.
1933-38 మధ్య యూరోప్ లో ఉన్నపుడు ఆయన 15 సైంటిఫిక్ పేపర్లను రాశారు. న్యూక్లియస్ లో ఉండే ఫ్రొటాన్లను, న్యూట్రాన్లను కలిపి ఉంచే శక్తి అయిన మీసోట్రాన్ కు మీసాన్ అనే పేరు బాగుందని సూచించింది కూడా భాభాయే.
రాయల్ సొసైటీ ఫెలో షిప్ కు భాబా పేరును ప్రతపాదించింది సివి రామన్. దీనికి అవసరమయిన మద్దతు శాస్త్రవేత్తలనుంచి కూడా గట్టింది కూడా రామనే. అపుడు భాబా గురించి రామన్ ఏమి రాశారో చూడండి. “…has contributed notably to our understanding of cosmic ray bursts by the penetrating component, and the radioactive decay of mesons. He has made important contributions to the theory of mesons and nuclear forces and has recently extended Dirac’s classical theory of radiating electrons to spinning particles and meson fields. Has indicated the theoretical grounds for the probable existence of protons with multiple charges”
నోబెల్ ప్రైజ్ కు నామినేషన్
భాబా పేరును 1951,915-1956 మధ్య చాలా సార్లు నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేశారు. తమాషా ఏమిటంటే ఫిజిక్స్ పరిశోధనారంగంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తలంతా ఆయన కు పరిచమయినా ఆయన పేరునే వాళ్లెవరూ నోబెల్ ప్రైజ్ నామినేట్ చేయలేదు. ఆయనను నామినేట్ చేసిందెవరో తెలిస్తే అవాక్కవుతారు.
Institute de France కుచెందిన పెద్దాయన, మ్యాథమాటిషియన్ జాక్ హదమర్ద్ (Jacques Hadamard). 1951 ఫిబ్రవరి 15న రేడియేషన్ పరిశోధనలో ముఖ్యంగా కాస్మిక్ రేస్ మీద భాభా చేసిన పరిశోధనలను ఉంటంకిస్తూ హదమర్ద్ నోబెల్ కమిటీకి ఒక చిన్న లేఖ రాశారు.
అయితే, ఈ లెటర్ నామినేషన్లు అందాల్సిన గడువు దాటాక పంపారు. తర్వాత హదమర్దే రెండు పేర్లు పంపారు.అవి: భాభా (ఫిజిక్స్)లైనస్ ఫౌలింగ్ (కెమిస్ట్రీ) ల పేర్లు ప్రతిపాదించారు.
ఇలా హదమర్ద్ భాబాపేరును, ఆయన పరిశోధనలను, అవి న్యూక్లియర్ ఫిజిక్స్ ఏంత ప్రయోజనమో చెబుతూ నాలుగు సార్లు వరుసగా నోబెల్ బహుమానానికి పంపించారు.
ఈ లెటర్ల వల్ల ఆయన క్వాలిఫై కాలేదు. నామినేటర్ చాలా స్ఫష్టంగా నామినీ రీసెర్చ్ ను డిఫెండ్ చేస్తూ రుజువులు కూడా పంపించాలి. హదమర్ద్ చేసిందంతా ఒక లేఖ రాయడమే.
అంతకుముందు సివి రామన్ పేరు నోబెల్ బహుమానానికి ఇ. రూథర్ ఫోర్డ్, సిటిఆర్ విల్సన్ లు నామినేట్ చేశారు. నోబెల్ కమిటీకి రామన్ పరిశోధనల గొప్పదనం చెబుతూ 160 పేపర్లను వారు సాక్ష్యంగా ఉదహరించారు. దీనికి భిన్నంగా హదమర్ద్ లేక ఖలు కేవలం టెలిగ్రామ్ లాగా క్లుప్తంగా ఉండేవి. ఆయన లేఖలను ఫ్రెంచ్ లో రాసేవారు.
ఈ లేఖ సారాంశం : “ For the Nobel Prize in Physics I propose the name of Professor Bhabha of Bombay for the reason of his work on radiations, especially cosmic radiation.”
భాభా పరిశోధన గురించి ఈ లేఖ లో ఏమీ ఉండేదికాదు. హదమర్ద్ ఎందుకు ఇంతకు మించి శ్రద్ధ తీసుకోలేదో అర్థంకాదు. అప్పటికి ఆయన 85 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన అంతకుమించి శ్రమ తీసుకోలేక పోయి ఉండవచ్చు.
తన పరిశోధనలను జాగ్రత్తగా భద్రపరిచి ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరికి పంపంచే అలవాటు భాభాకు లేదు. సివి రామన్ అలాంటి బాగా చేసే వారు. ఆయన పంపిన సైంటిఫిక్ పేపర్లనే రూథర్ ఫోర్డ్, విల్సన్ లు నోబెల్ కమిటీకి పంపించారు. అంతేకాదు,తన పేరును నామినేట్ చేయవలసిందిగా రామన్ నీల్స్ బోర్ ను చూడా కోరారు. భాభా చేసినట్లు గానే కాస్మిక్ రేస్ మీద పరిశోధనలు చేసిన అనేక మంది పేర్లు నోబెల్ కమిటీకి వచ్చాయి. ఆ పేర్లకు మంచి పరిచయ వాక్యాలున్నాయి. అలాంటి బలమయిన నామినేషన్ లేనందున భాభాపేరు ఎపుడు షార్ట్ లిస్టు కాలేదు
భాభా ప్రతిపాదించిన పేర్లు
ఆశ్చర్యం ఏమిటంటే కొంత మందిపేర్లను హోమీ భాభా స్వయంగా ప్రతిపాదించారు. నోబెల్ కమిటీ ప్రతిసంవత్సరం సెప్టెంబర్ లో కొన్ని పేర్లు ప్రతిపాదించాలని ఆయా రంగాలలోని ప్రముఖులకు లేఖలు రాస్తుంది.
తదుపరి ఫిబ్రవరిలో నామినేటర్స్ కొంతమంది పేర్లను కమిటీ ప్రతిపాదించాలి. ఒక నామినేటర్ ఒకటి కంటే ఎక్కువ పేర్లను కూడా ప్రతిపాదించవచ్చు.
1951 ఫిబ్రవరి 16 ఆయన యుకె కు చెందిన న్యూక్లియర్ ఫిజిసిస్లు జె డి కాక్ క్రాఫ్ట్ పేరు ప్రతిపాదించారు. కాక్ క్రాఫ్టకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే, ఆయన ఎర్నెస్ట్ వాల్టన్ తో కలసి పంచుకున్నారు.
తర్వాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫెలిక్స్ బ్లాంక్ పేరును ప్రతిపాదించారు. ఆయన తరఫున బాగా వాదించారు. 1952లో ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది.
భాభా పంపిన మూడో ప్రతిపాదన (1952) అమెరికాకు చెందిన విలిస్ ఇ ల్యాంబ్ పేరు. 1955లొ ల్యాంబ్ కు నోబెల్ ప్రైజ్ లభించింది.
అంటే భాబాకు స్వయంగా నోబెల్ ప్రైజ్ రాకపోయినా ఆయన ప్రతిపాదించిన ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
(ఈ స్టోరీ మీకు నచ్చితే, మీ మిత్రులకు షేర్ చేయండి)
మరింతకి భాభాని నోబెల్ కమిటీ ఎందుకు గుర్తించలేకపోయింది?
దీనికి కొన్ని కారణాలు చెబుతారు. 1. భాభా పరిశోధనలను అమెరికా , బ్రిటిష్ శాస్త్రవేత్తలు సీరియస్ గా తీసుకోనకపోవడం,
2. భాభా కు అంతర్జాతీయంగా మంచి కనెక్షన్లు లేకపోవడం. దీని వల్ల ఆయనపేరు ప్రముఖులెవరూ ప్రతిపాదించకపోవడం,
3. బాభాపరిశోధన చేసిన రంగంలో అప్పటికే నోబెల్ బహమతి వచ్చిఉండటం.
ఈమూడు కారణాలలో ఏది కరెక్టో చెప్పడం కష్టం. అన్ని కలసి పని చేసి ఉండవచ్చు.
అర్థంకాని సమస్య ఇక్కడొకటి ఉంది. భాభా ప్రతిపాదించిన మూడుపేర్లు విదేశీయులవే. ఆయన ఒక్క భారతీయుడిపేరును కూడా ప్రతిపాదించలేదు. కారణం: భారతదేశంలో నోబెల్ స్థాయి పరిశోధనలు జరగలేదనేనా?
(ఈ వ్యాసం సమాచారాన్ని Rajinder Singh, Hardev Singh Virk రీసెర్చ్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది)
(ఫోటో కర్టసీ homibhabhafellowships