భారతీయ యువతీ యువకులను చైనా కురచ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ తన గ్రిప్పులోకి తీసుకుంటూ ఉంది.
అగ్రెసివ్ గా టిక్ టాక్ వోనర్ బైట్ డాన్స్ చేస్తున్న చేస్తున్న క్యాంపెయిన్ కు భారతీయ స్టార్టప్ షేర్ చాట్ తట్టుకోలేకపోతున్నది.
నాలుగేళ్ల కిందట వచ్చిన బెంగుళూర్ ‘షేర్ చాట్’ టిక్ టాక్ దూకుడు ముందు ఆగలేక నష్టాల్లో పడిపోయింది.
షేర్ చాట్ నూటికి నూరుపాళ్ల భారతీయ కంపెనీ. దీనిని కాన్పూర్ ఐఐటికి చెందిన ముగ్గురుకుర్రవాళ్లు అనుష్ సచ్ దేవా, ఫరీద్ ఆసన్, భాను సింగ్ 2015లో స్థాపించారు.
ఇందులో ఎవరయినా తమ ఒపినీయన్స్ షేర్ చేసుకోవచ్చు. వీడియోలు విడుదల చేయవచ్చు. స్నేహితులను తయారుచేసుకోవచ్చు. అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. విశేషమేంటే, భారతీయ భాష్లలో ఈ కార్యకలాపాలుసాగించవచ్చు.
అయితే లోపు చైనాకు చెందిన బైట్ డాన్స్ రెండేళ్ల కిందట భారత్ లోకి ప్రవేశించింది. ఇది షేర్ చాట్ కు బాగా పోటీ గా టిక్ టాక్ ను తీసుకువచ్చింది.
మార్కెట్ షేర్ విస్తరించుకునేందుకు రెండు కంపెనీలు ఇపుడు వీపరీతంగా డబ్బుఖర్చుచేస్తున్నాయి.
దేశంలో షేర్ చాట్ కు 60 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. కంపెనీ విలువ 500 మిలియన్ల డాలర్లనుంచి 600 మిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా. ఇంత భారీగా యూజర్లున్నా కంపెనీ నిర్వహణాభారం బాగా పెరిగిపోయింది.
దీనితో నష్టాలు మొదలయ్యాయి. 2019 లో షేర్ చాట్ ఖర్చులు రు. 440.5 కోట్లకు చేరుకున్నాయి. 2018లో ఇది కేవలం రు. 35.4 కోట్లే.
బెంగళూరు కేంద్రంగా పనిచేసే షేర్ చాట్ కంపెనీ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ 2019 ఆర్థిక సంవత్సరంలో 415 కోట్లు నష్టపోయింది. 2018 లో వచ్చిన రు. 33.8 కోట్ల తో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. ఈవిషయాలను షేర్ చాట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) సమర్పించిన డాక్యుమెంట్లలో వెల్లడించింది.
ప్రపంచంలో రెండో పెద్ద దేశమయిన భారతదేశంలో సోషల్ మీడియా మార్కెట్ ని కంట్రోల్ చేసేందుకు ఫేస్ బుక్ గూగుల్,టిక్ టాక్, షేర్ చాట్ లు ఇపుడుపోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలకు భారత్ ఒక యుద్ధభూమిఅయిపోయింది. రెగ్యులేర్స్ నుంచి , పొలిటిషన్స్ నుంచి కంటెంట్ విషయంలో వ్యతిరేకత వచ్చినా టిక్ టాక్ యూజర్ బేస్ పెంచుకోగలిగింది. పోతే, గూగుల్ ఇండియా ఇదే ఆర్థిక సంవత్సరంలో 16శాతం గ్రోత్ తో రు. 473 కోట్ల ఫ్రాఫిట్ సాధించింది. ఈ పోటీ వాతావరణంలో షర్ చాట్ పెరిగిపెద్దదవ్వాల్సి ఉంది.
ఇదే సమయంలో బైట్ డాన్స్ కంపెనీ ఇండియాలో లాభాలను ఆర్జిస్తూ ఉంది. బైట్ డాన్స్ కు మూడు రకాల వీడియో , కంటెంట్ యాప్స్ ఉన్నాయి. వాటిపేర్లు టిక్ టాక్, హెలో, విగో వీడియో. బైట్ డాన్స్ ఇండియన్ కంపెనీ ఇంత తొందరగా అధిగమించడమే ఆశ్చర్యం.
యూజర్ల సంఖ్యలోనూ, రాబడిలోనే బైట్ డాన్స్ షేర్ చాట్ ను మించిపోయింది. మార్చి 2019 ముగిసిన ఫైనాన్సియల్ ఇయర్ లో చైనాకంపెనీ 479,000 అమెరిన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తే, షేర్ చాట్ 58.3 మిలియన్ డాలర్ల నష్టాల్లో పడింది.
టిక్ టాక్ వచ్చి రెండేళ్లే అయింది. అయినా సరే 120 మిలియన్ యూజర్లతో కిటకిటలాడుతూ ఉంది. ఇలాగే హెలో కు 50 మిలియన్ల, విగో వీడియోకు 20 మిలియన్ల యూజర్లున్నారు.
షేర్ చాట్ తన యూజర్ బేస్ పెంచుకోవడానికి 2019 ఆర్ఠిక సంవత్సరంలో మార్కెటింగ్ మీద 30 మిలియన్లు, ప్రమోషన్ మీద 10.5 మిలియన్ డాలర్లు, బిజినెస్ డెవెలప్ మెంటు మీద 2.8 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
షేర్ చాట్ లో ఎలాంటి పోర్నోగ్రఫిక్, వల్గర్ కంటెంట్ లేకుండా చూసేందుకు మరొక 5 లక్షల డాలర్లు ఖర్చుచేసింది. తాము వెనకబడినా తమ ఆశయం భారతీయ భాషల్లో సాధ్యమయినంత ఎక్కువ మందికి చేరుకోవాలనే లక్ష్యంమారదని షర్ చాట్ ప్రమోటర్లు చెబుతున్నారు.
షేర్ చాట్ పిడుగులు వీళ్లే…ఫరీద్ఆసన్, భానుసింగ్,అంకుష్ సచ్ దేవ్
ఫోటో yourstory సౌజన్యం