బంగారు ధర విపరీతంగా పెరగడంతో భారతదేశంలో మార్కెట్ కుప్పకూలిపోయింది.
ఈ సారి ప్రజలు ఎంతజాగ్రత్త పడుతున్నారంటే, బంగారు కొనడమే కాదు, బంగారంలో ఇన్వెస్టు చేయడం కూడా మానేశారు.
సెప్టెంబర్ ముగిసిన 2019రెండో క్వార్టర్ లో బంగారు బిజినెస్ లో వినియోగదారులు స్పష్టంగా బంగారు నుంచి దూరంగా జరిగినట్లు GFMS ఫీల్డ్ సర్వేలో వెల్లడయింది.
ఈ మూన్నెళ్ల కాలంలో బంగారు వినియోగం కేవలం 54 టన్నులు మాత్రమే. ఇన్వెస్ట్ మెంట్ డిమాండయితే ఇంకా పడిపోయి ఏడు టన్నులకు చేరింది. ఈ విషయాలను జిఎప్ ఎమ్ఎస్ గోల్డ్ సర్వేవెల్లడించింది.
కొనుగోళ్లు పడిపోవడంతో జ్యుయలర్స్ బంగారు కొనడం మానేశారు. బంగారు ఫ్యాబ్రికేషన్ డిమాండ్ కూడా 62 టన్నులకు పడిపోయింది. ఇది చాలా తక్కువఅని చెబుతున్నారు.
ఇపుడు అధిక ధరల వల్ల ఎవరూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావడం లేదు. క్వార్టర్ 3 లో గతంత పోలిస్తే డిమాండ్ 74 శాతం (7 టన్నులు) పడిపోయింది.
వర ల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018 రెండో క్వార్టర్ దేశం లో బంగారు వినియోగం 189.2 టన్నులు.
మామూలు గా ఈ క్వార్టర్ లో మంచి ముహూర్తాలుండవు కాబట్టి పెళ్లిళ్లు తక్కువ. అందువల్ల అటువంటి డిమాండ్ తక్కువగానే ఉంటుంది. అయితే, ఏ సంవత్సరంలో కూడా డిమాండ్ ఈ ఏడాది లాగా పాతాళానికి పడిపోలేదు.
2016 రెండో క్వార్టర్ లో ఇలాంటి పరిస్థితే ఎదురయినా డిమాండ్ 74 టన్నులుండింది.
బంగారు అభరణాల కొనుగోలు డిమాండ్ పడిపోయిన దాని దుష్ట్రపభావం అపుడే ఉపాధి మీద కనిపిస్తూ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా స్వర్ణకారులు బాగా దెబ్బతింటున్నారు. వాళ్లకి బంగారు అభరణాలు తయారుచేసే కూలిపని తగ్గిపోయింది. దీనితో చాలా మంది స్వర్ణకారులు రోడ్డున పడ్డారని,వాళ్లు ఇతర ఉపాధి కోసం ఇతరపనులు వెదుక్కునే దయనీయపరిస్థితి ఈ సారి ఎదురయిందని వారు చెబుతున్నారు.
ఈ సంస్థ అధ్యయనం ప్రకారం 40 శాతం మంది స్వర్ణకారులు మాంద్యం వల్ల ఉపాధి కోల్పోయారు. వీళ్లంతా బంగారు అంగళ్లలో పనిచేసే రోజుకూలీలు. వీళ్ళకి లేబర్ చట్టం పరిధిలోకి రారు. అందుకే వీళ్లు ఈ మాంద్యంతో తొందరగా రోడ్డున పడ్డారు.