*నవంబర్ 1 రాయలసీమ విద్రోహదినం.*
*ఖాళీప్లేట్లతో అర్థనగ్నంగా నగరంలో బిక్షాటన.*
*రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ.*
ఆదోని నగరంలోని స్థానిక బీమాస్ సర్కిల్ లో రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ నేతలు రవికుమార్, భరత్ కుమార్, రంగమునినాయుడు, ఎద్దుపెంటఅంజీ, సాయి ప్రసాద్, అంజీ, నల్లన్న, ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లతో అర్థనగ్నంగా నగరంలో భిక్షాటన చేసారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ ఒకటిగా ఉండాలని నాడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్ తరలించి రాయలసీమ ప్రజలను భిక్షగాళ్లను చేసారనీ నాడు రాయలసీమ ప్రజల త్యాగానికీ 59ఏళ్లు గడిచిన నేటికీ రాయలసీమకు ఏ ప్రభుత్వంకూడ న్యాయం చేయలేదని రాయలసీమకు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం 2014లో రాజధాని రావలసివున్నా నాటి ప్రభుత్వం రాజధానిని ఓంటెద్దుపోకడతో దీనిని అమరావతికీ తరలించారని రాయలసీమలో కరువుతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలు వెలుతున్నారనీ నిరుద్యోగ యువత సరైన ఉపాధిలేక దిక్కుతోచనిస్థితిలో తల్లిదండ్రులకు వారి పరిస్థితిని చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారనీ.. నీటివాటలో రాయలసీమ సరైన నిఖరజలాల వాటలేదనీ, మొన్నటికీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజిలను ఏర్పాటు చేయాలని తలపెడితే అందులో ఓక్క కాలేజీ మాత్రమే రాయలసీమకు కేటాయించి మిగిలినవన్నీ కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేయడం దేనికీ సంకేతమనీ వారు ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు, నిరుద్యోగులు భిక్షాటన చేయడం మినహా వేరే మార్గం లేదని వారు వాపోయారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని అందులో భాగమైన రాజధాని, హైకోర్టు, నీటివాట, నియోజకవర్గాల పెంపు, నిధులు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తేతప్ప రాయలసీమకు న్యాయం జరగదని అన్నారు.
ఈ కార్యక్రమాలలో భాగంగా నవంబర్ 5న మంగళవారం ఆదోని మున్సిపల్ మైదానంలో రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటకై రాయలసీమ విద్యార్థి యువజన గర్జన నిర్వహిస్తున్నామని దీనికీ అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు తేజ, అశోక్, శేఖర్, నల్లారెడ్డి, రమేష్, క్రిష్ణ, వీరేష్, కోదండ, ఖాజ, శివ, వినోద్, రాజేంద్రప్రసాద్, సాయి, న్యాయవాదులు పాల్గోన్నారు.