ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి రోజుల్లో ఒకవెలుగు వెలిగి ఐఎఎస్ అధికారుల్లో సివిఎస్ కె శర్మ ఒకరు.2004-2013 మధ్య ఉమ్మడి ఆంధ్ర ఐఎఎస్ అధికారులలో ఆయన ఒక సూపర్ స్టార్.
శర్మ 1980 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ముఖ్యమంత్రి కార్యాలయం, ఇరిగేషన్ డిపార్టమెంటు, జిహెచ్ ఎంసి, చివర వ్యవసాయ శాఖల లో ఉన్నత పదవులలో ఉన్నారు.
కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు.
జిహెచ్ ఎంసి కమిషనర్ గా ఉన్నపుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అర్ధరాత్రి పర్యటనలు, ఇన్స్ పెక్షన్లు…కొద్దిరోజులు ఎక్కడచూసినా ఆయనే కనిపించారు.అయినా సరే హైదరాబాద్ బాగుపడేందేమీ లేదు ఉత్త పబ్లిసిటి తప్ప.
మీకు గుర్తు ఉండే అంటుంది. హైదరాబాద్ అమీర్ పేటలో 9 ఎకరాల భూమిని డీనోటిఫై చేసిన కేసు ఆ మధ్య పెద్ద సంచలనం సృష్టించింది.
అది ఎసిబి కోర్టు విచారణకు వచ్చింది. ఆ కేసు అంత ప్రచారానికి రావడానికి కారణం, అందులో ఉన్న మరొక వ్యక్తి. అదెవరో కాదు, నాటి ముఖ్యమంత్రి, కేసు సమయంలో తమిళనాడు గవర్నర్ గా ఉన్న కొణిజేటి రోశయ్యం.
ఈ భూమి వ్యవహారం ఎసిబి కోర్టు విచారణలో ఉన్నపుడు సివిఎస్ కె పేరు బాగా పాపులర్ అయింది.
విషయమేమింటే, ముఖ్యమంత్రులంతా ఆయనంటే చాలా ఇష్టపడేవారు.
వైఎస్ కాలంలో జలయజ్ఞం ఆయన చేతుల మీదుగానే మొదలయింది. దీనివల్లే ఆయనకు జగన్ కేసులు చుట్టుకున్నాయని చెబుతారు. వాటికి సంబంధించిందే ఇపుడు ఆయనకు మరొక కేసు తగులుకుంది.
ఈ సారి ఆయనతో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్పెనా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తున్నపుడు తన తరఫున లాయర్ల ను ఏర్పాటుచేసుకున్నపుడు ఖర్చవుతుంది కదా. ఆ ఖర్చులకు ప్రభుత్వం ఖాతాలో వేశారు. బాగానే ఉంది. అయితే బిల్లులో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. అసలే అక్రమాల కేసులు.దానికి మళ్లీ నకిలీ బిల్లులు. ఈకేసులలో ఆయన నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాజేశారని ఇపుడు కేసు పడింది.
ప్రభుత్వం బాగా పలుకుబడి ఉన్నవాడయినందున, ఈ నకిలీ బిల్లుల సృష్టిలో ఆయనకు ఉన్నతాధికారులు సహకరించారంటూ హైదరాబాద్కు చెందిన జనతాదళ్(యూ) ప్రధాన కార్యదర్శి ఏవీ రమణ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శర్మకు రూ.7.56 లక్షల మొత్తాన్ని చీఫ్ సెక్రెటరీ పీకే మహంతి మంజూరు చేశారని దీనిని అపుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వీపీ రమేశ్ ఒకె చేశారని రమణ ఆరోపించారు.
ఈ నకిలీ బిల్లులను పరిశీలించకుండానే రమేష్ డబ్బు విడుదల చేశారని రమణ చెబుతున్నారు.
ఈ అక్రమాల మీద కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే అధికారులు పట్టించుకోవడం లేదని అందువల్లే తాను కోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చిందని రమణ చెప్పారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు ముగ్గురు రిటైర్ట్ అధికారులపై కేసు నమోదు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు.
వారి మీద ఐపీసీ 403, 406, 409, 417, 420, 193, 192, 120బి రెడ్విత్ 34తో పాటు సీఆర్పీసీ 156(3) కింద కేసులు నమోదు చేశారు.
న్యాయవాది అయిన రణమ తరచూ ప్రభుత్వాధికారుల అక్రమాల మీద విచారణ జరిగేలా పోరాడుతూ ఉంటారు.
2011-12 మధ్యకాలంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సాగుతున్న సమయంలో కొంతమంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందంటూ రమణ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
అపుడు ఈ అధికారులు తాము విధులు మాత్రమే నిర్వహించామంటూ ఉన్నతాధికారులను కోర్టు లలో వాదించాల్సి వచ్చింది. ఈ కేసుల ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వ్యక్తిగత న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. సుప్రీంలో కేసు డిస్మిస్ అయిన తర్వాత న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులలో మళ్ళీ అక్రమాలు జరిగాయని ,ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి అధికారుల వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు వెళ్లాయని రమణ వాదించారు.
ప్రభుత్వ నిధులు అధికారుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఎలా వెళ్తాయంటూ రమణ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశం మేరకు అధికారులపై కేసు కూడద నమోదైంది.
సివిఎస్ కె శర్మ గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన వాడు. ఐఎఎస్ గా అనేక ప్రతిష్టాత్మక బాధ్యతలను నిర్వర్తించి 2013లో వ్యవసాయఖలో ఉంటూ రిటైరయ్యారు