ప్రపంచాన్ని కుదిపేసిన వార్త ఇస్లామిక్ స్టేట్ (IS)నాయకుడు, టెర్రరిస్టు అబు బకర్ ఎల్ బగ్ధాది ని అమెరిక్ అర్మీ స్పెషన్ ఫోర్సెస్ మట్టు బెట్టటడం.
ఈ విజయానికి అమెరికా అధ్యక్సుడు డొనాల్డ్ ట్రంఫ్ తనను తాను ప్రశంసించుకున్నా, దీనికి బాట వేసిన వాల్లు చాల మంది ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా, బగ్ధాది ఉనికి గురించి, నిర్ధారించుకుని, ఆ రహస్యాన్ని అమెరికా సేనలకు చేరవేసింది ఖుర్దిస్ సేనలని అందరికీ తెలిసిపోయింది. కుర్దిష్ సేనలు సమాచారం అందించాక అమెరికా సేనలు మిగతా పని పూర్తి చేశాయి. ఇది వేరే విషయం.
అయితే, ఎల్ బగ్ధాదిని మట్టు పెట్ట్టడంలో కీలక పాత్ర పోషించింది ఒక మిలిటరీ కుక్కు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేసినా, దాని పేరు ఆయన వెల్లడించలేదు. ఆమెరికా న్యూస్ వీక్ మ్యాగజైన్ మొత్తానికి ఈ కుక్క పేరు సంపాదించింది. ఈ మగ కుక్క పేరు కోనన్ (Conan).
“We have declassified a picture of the wonderful dog (name not declassified) that dis such a GREAT JOB in capturing and killing the leader ofISIS, Abu Bakr al-Baghdadi.” అని ట్రంప్ ట్వీట్ చేశారు.
దీని పేరు కోనన్ అని చాలా మంది తెలిసిన వాళ్లు చెప్పారని న్యూస్ వీక్ పేర్కొంది.
అల్ బగ్దాది మీద దాడి చేయాలనుకుంటున్నపుడు అతగాడు ఆత్మాహుతి కోట్ ను పేల్చుకుని చనిపోయాడు. అపుడు ఈ కుక్క కొద్దిగా గాయపడిందని ట్రంప్ చెప్పారు. అయితే ఇది ఇపుడు పూర్తిగా కోలుకుందని, సిరియా టెర్రరిస్టు స్థావరం మీద దాడిచేయడంలో కీలక పాత్ర పోషించింది ఈ కుక్కేనని అధికారులంతా ధృవీకరించారు.
We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw
— Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019
ఇది బెల్జియన్ మలినాయ్ స్ జాతికి చెందిన శునకం.ఈ జాతి శునకాలు చాలా తెలివైనవి, ఒక్క సారి వుసిగొల్పితే తెగించిపోరాడతాయి.
ఇలా శునకాలాను టెర్రరిస్టుల మీద జరిపే మిలిటరీ కార్యక్రమాలలో వినియోగించడం కొత్త కాదు. 2011లో యుఎస్ నేవీ సీల్స్ పాకిస్తాన్ లోని ఒక స్థావరంలో దాక్కుని ఉన్న అల్ ఖేదా నాయకుడు ఉసామా బిన్ లాడెన్ ను తుదముట్టించేందుకు ప్రయోగించింది బెల్జియన్ మలినాయస్ జాతి శునకాన్నే. దాని పేరు కైరో (Cairo). బిన్ లాడెన్ ను చంపిన కమెండోలను అభినందిస్తున్నపుడు ప్రెశిడెంట్ ఒబామా కైరోను కలుసుకున్నారు.