దీపావళి ‘గ్రీన్ కవిత‘

కోటి దీపాల కాంతుల్లో
దేదీప్యమానంగా వెలిగే పుడమిని
చూస్తే ముచ్చటగా ఉంటుంది

చిచ్చు బుడ్లు
కాకర పువ్వొత్తులు
భూచక్రాలు
ఇంటి ముందు కన్నుల పండువగా వెలుగుతూ
మన కంటి వెలుగుల్లో సంతోషాలు నింపుతాయి

అందరికీ ఆనందాలు పంచే పండుగ
దీపావళి
మనమూ కాల్చుదాం టపాకాయలు
బుజ్జి పిట్టల గుండెలు అదరనంతవరకు
మనమూ పేల్చుదాం లక్ష్మీ బాంబులు
ఆపరేషన్లతో నిలకడైన గుండెలకు ఆదరువుగా
మనమూ కాల్చుదాం రాకెట్లను
మన ఊపిరితిత్తుల్లో కార్బన్ మోనాక్సైడ్ చేరనంతవరకు

మనమూ వెలుగులు నింపుదాం
ఎదుటివారి బతుకుల్లో
చీకటిని తరిమేస్తూ
సురక్షితమైన దీపావళి
మోగిస్తుంది సంతోషాల రవళి

– నస్రీన్ ఖాన్
– 27.10.2019