తెలంగాణలోనే కాదు, ,మొత్తం దేశలోనే హుజూర్ నగర్ ప్రజలు అదృష్టవంతులు. బంగారు తెలంగాణ ఎంత దూరాన ఉందో తెలియదు గాని, హూజర్ నగర్ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్ల ముందు అది కనబడేలా చేశారు. ఉప ఎన్నికలో టిఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కి 43 వేల మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ఆయన ఈరోజు హుజూర్ నగర్ కు వచ్చి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రజా కృతజ్ఞత సభలో కరతాళధ్వనుల మధ్య ప్రసంగించారు. టిఆర్ ఎస్ మొదటిసారి గెలిపించినందుకు కృతజ్ఞతగా ఆయన ఏమేమి ప్రకటించారో చూడండి. ఓక్క మాటలో చెబితే ఒక్క ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ తప్ప ఆయన అన్నీ ప్రకటించారు. ఇదిగో జాబితా :
134 గ్రామ పంచాయితీకి 20 లక్షల చొప్పున మంజూరు.
రేపో ఎల్లుండో… జీవో జారీ.
మండల కేంద్రానికి 30 లక్షలు.
హుజుర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్ల నిధులు.
నేరడుచర్లకు 15 కోట్ల మంజూరు.
గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్, బంజారా భవన్ కూడా మంజూరీ
పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం. త్వరలోనే నేను, మంత్రివర్గం ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తాం.
హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ వెంటనే మంజూరు.
ఈఎస్ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తున్నాం.
హుజుర్ నగర్ కు కోర్టు మంజూరీ.
డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు ఇస్తాం.
1997లో నేను కరువు మంత్రిగా వచ్చినప్పుడు చెప్పిన సమస్యలు ఇంకా ఉండడం బాధాకరం.
మూడు ఫీట్ల మంత్రి జగదీశ్ రెడ్డి.. 300 కిలోమీటర్ల వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ త్వరలోనే పూర్తి. జిల్లా అభివృద్ధి ముఖచిత్రం మారిపోతుంది.
సాగర్ ఆయకట్టులో లిఫ్టులు, మేజర్లు ఉన్నాయి. కానీ వాటి నిర్వహణను గాలికి వదిలేశారు.
ఈ రోజు మంచి దినం. యావత్ తెలంగాణ ప్రజలకు
తెలంగాణలో ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ దుఃఖం నాదే.
ఎవరూ ఎన్ని అన్నా… వెనక్కు తగ్గలేదు.
నాగార్జునసాగర్ ఆయకట్టును కాపాడుకోవాలి.
గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కాల్వలో పడాలి.
కేసీఆర్ గా ఒక్కటే మాట…. సాగర్ ఆయకట్టుకు వస్తా … పదిహేను రోజుల్లో ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వస్తా. ఆయకట్టు సమస్యలు పరిష్కరిస్తా.
జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ తిరిగి ఒక కాన్సెన్సస్ కు వస్తే… నేను వస్తా.
మొత్తం ఆయకట్టు పారేలా చేస్తా
కుర్చీ వేసుకుని ఇక్కడేకూర్చుని ఈ పని పూర్తయ్యేలా చేస్తా.
అన్ని లిఫ్టుల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది
అందులో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది.
హుజుర్ నగర్ పట్టణానికి రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్ మంజూరీ చేస్తున్నాం.
వెలుగు జిలుగుల తెలంగాణ కావాలి.
మిషన్ భగీరథ త్వరలో మిగిలిన పనులు పూర్తి
రైతుబంధు దేశానికే ఆదర్శం
నెక్స్ట్ టైం వచ్చినపుడు జాన్ పహాడ్, మట్టపల్లికి వస్తా.
కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు.
ఎవరూ ఏమీ అన్న… హుజుర్ నగర్ ప్రజలు ఇచ్చిన మద్దతుతో ముందుకు సాగుతా.