టిడిపి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. దీనితో చాలా వూహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్.జగన్ తాడేపల్లి నివాసం లో నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పేర్నినాని, కొడాలి నాని కూడా పాల్గొన్నారు.
ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన అంత హ్యాపీగా లేరని అంటున్నారు. అందుకే బయటకు వెళ్లే దారి వెదుక్కుంటున్నారని వార్తలొస్తున్నాయి.
ఆ మధ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ని కూా కలిశారు. ఆయనను బిజెపిలోకి తీసుకువచ్చేందుకు పార్టీ ఎంపి సుజనాచౌదరి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. సుజనా చౌదరితో వంశీకి మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు, కేంద్రంలో తన పలుకుబడి నిరూపించుకునుందుకు ఆయన కొంతమంది టిడిపి ఎమ్మెల్యల
ఆయన సలహా మేరకే వంశీ కిషన్ రెడ్డి ని కలిశారు. ఈ సమావేశం తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే ఆంధ్రలో బిజెపికి ఇంకా పట్టు దొరకలేదని,అందుకే బిజెపిలోకి దూకినందున తక్షణం వచ్చేఫలితం ఉండదని ఆయన భావించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
ఇపుడు ఆయన ఏకంగా క్రిష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ కలిశారు. ఈ మార్గం ఎలా ఉందో చూస్తున్నారని అంటున్నారు. ఆయన ఏంచెబుతారో చూడాలి. సాధారణం శాసన సభ్యులంతా నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తుంటారు. టిడిపి హయాంలో వైసిసి శాసనసభ్యులంతా అలాగే ఫిరాయించారు. ఇపుడు వంశీ గన్నవరం అభివృద్ధికి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని బాగా వినబడుతూ ఉంది.