తెలంగాణ ఐఏఎస్ ల ఫై హై కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
డెంగ్యూ మరణాలు నివారణ చర్యల కేసు ఈ రోజు కోర్టు విచారణకు వచ్చింది. ఈ విచారణలో హైకోర్టు ఈ వ్యాఖ్యలుచేసింది.
’3800 కేసులు నమోదు అయితే ప్రభుత్వం తక్కువ కేసులు చూపెడుతుంది చీఫ్ సెక్రెటరీ తోసహా మీరందరు మూసి నదిని పరిశీలించండి. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లు కూడా నది మధ్యలో నే ఉన్నాయు అక్కడ లేని డెంగ్యూ మరణాలు ఇక్కడ ఎందుకున్నాయి. మూసి ని అనుకోని ఉన్న హై కోర్ట్ లోనే దోమలు ఉన్నాయి. జనవరి లో 85 కేసులు ఉంటే అక్టోబర్ నాటికి 3800 కేసులు ఎలా పెరిగాయి?డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రభుత్వం విఫలమయింది. అయితే మృతుల కుటుంబాలకు 50 లక్షలు చెల్లించాల్సిందే,’ అని హై కోర్ట్ చెప్పింది.
తెలంగాణ ఐఏఎస్ లు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నిస్తూ , కోట్లు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్ లను చేస్తే మీరు సామాన్య ప్రజలకు ఎం సేవ చేస్తున్నారని హై కోర్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్ట్ ఆదేశాలను పాటిచకుంటే ఐఏఎస్ ల ఫై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామన్న హై కోర్ట్ హెచ్చరించింది. అధికారుల నిర్ల్సక్ష్యమ్ ద్వారా ఎవరు అయినా మరణిస్తే ఐఏఎస్ లదే బాధ్యత హై కోర్ట్ చెప్పింది.
మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఐఏఎస్ ల సొంత ఎకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుందనికూడా చెప్పింది. హై కోర్ట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కోర్ట్ లోసీఎస్ జోషి , అరవింద్ కుమార్ , లోకేష్ కుమార్ , శాంత కుమారి , యోగితా రాణా సైలెంట్ గా ఉండిపోయారు.
ఐఏఎస్ ల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరువస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.