ఈ రోజు హెడ్ లైన్స్ ఇవే…

చిదంబరానికి బెయిల్ మంజూరు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి ఐఎన్ ఎక్స్ మీడియా బెయిలు మంజూరు చేసింది. ఆయన దేశం విడిచిపారిపోతాడని, సాక్షులను ప్రభావితం చేస్తాడని సిబిఐ చేసినవాదనని కోర్టు ఆమోదించలేదు. అలాంటి దేమీ తమకు కనిపించలేదనిన్యాయమూర్తులు భానుమతి, బాపన్న, హషీ కేఫ్ రాయ్ లు పేర్కొన్నారు.  అయితే, చిదంబరం వెంటనే బయటపడే అవకాశం లేదు.ఎందుకంటే,  ఇదే కేసులో మనీ లాండరింగ్ యాంగిల్ ఇంకా ఇడి విచారణలో ఉంది. దీనికోసం ఇడి ఆయనను ఈనెల 16 నే అరెస్టు చేసింది. ఆగస్టు 21 నుంచి చిదంబర్ జైలులో ఉంటున్నారు.

చంద్రయాన్ – 2 విక్రమ్ ఆచూకీ దొరకలేదు

సెప్టెంబర్ ఏడో తేాదీన చంద్రుడి మీదకు దిగుతూ దారితప్పి పడిపోయిన చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ కనిపించలేదు. నాసా ఈ విషయం ప్రకటించింది. అక్టోబర్ 14న  విక్రమ్ పడిపోయిందనుకున్న ప్రదేశంలో నిఘావేసిన నాసా లూనార్ రికనైజాన్స్ అర్బిటర్ ఫోటోలు తీసి నాసాకు పంపించింది. ఈ ఫోటోలు వచ్చాక ఇక విక్రమ్ ఆచూకి తెలుస్తుందని భావించారు. అయితే, ఈఫోటోలను విశ్లేషించకా ఇక్కడ విక్రమ్ ల్యాండర్ లేదని నాసా ప్రకటించింది.

 

బిసిసిఐ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన గంగూలి


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు నూతన కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా, కోశాధికారిగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ కూడా బాధ్యతలు స్వీకరించారు.

రైతు ఆత్మహత్య

బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో ఒంటిపైన పెట్రోల్ పోసుకుని గోవర్ధన్ రెడ్డి అనేరైతు ఆత్మహత్య యత్నం. మార్కెట్ లో మంత్రి నిరంజన్ రెడ్డి కార్యక్రమం జరుగుతుండా గానే జరిగిన ఘటన

***

రేవంత్ రెడ్డి మీద కేసు  నమోదు

మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పొలిసులు. చలో ప్రగతి భవన్ సందర్భం గా పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు రేవంత్ ఫై 351 ,353 ,332 సెక్షన్ల కింద కేసు నమోదు.రేవంత్ తో పాటు మరో ముగ్గురు రేవంత్ అనుచరుల ఫై కేసు నమోదు.జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

బిఆర్ కె భవన్ నుంచి లక్డీకాపూల్ మెట్రో దాకా షటిల్ సర్వీస్

 

తాత్కాలిక సెక్రెటేరియట్ గా మారిని బీఆర్కేఆర్ భవన్ నుంచి లక్డీకాఫూల్ మెట్రో స్టేషన్ వరకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం.రెండు 12 సీటర్ బస్సులను అందుబాటులోకి తేనున్న అధికారులు. బీఆర్కేఆర్ భవన్ నుంచి లక్డీకాఫూల్ మెట్రో స్టేషన్ వరకు నిరంతరం షటిల్స్.ఇవాళ 5:15 ని. లకు బీఆర్కేఆర్ భవన్ పో నుంచి జెండా ఊపి ప్రారంభించనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.ఆసక్తి ఉన్న ఉద్యోగులు మెట్రో రైల్ సేవలు వినియోగించుకోవాలని సాధారణ పరిపాలనా శాఖ సర్క్యులర్ జారీ.