ఆర్టీసి సమ్మె ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించకపోవడం, మరోనెలాఖరు వస్తూ వుండటంతో ఆర్టీసి కార్మికుల్లోని పేద వర్గాలు బాగా ఆందోళనకు గురవుతున్నాయి. వాళ్లలో ఎంత అందోళన ఉందో… నిజామాబాద్ డిపో కు చెందిన డ్రైవర్ మహమ్మద్ గఫార్ (34) సాక్ష్యం. ఆయన నిన్న గుండెపోటుతో మృతి చెందాడు.కారణం ఉద్యోగంలో కి తీసుకుంటారో లేదో. జీతం రాదు,జీవితం ఎలా? అనే ప్రశ్న.
ఆయన సొంత ఊరు కామారెడ్డి జిల్లా, గోలిలింగాల. ఒక తమ్ముడు,అమ్మనాన్నలు, ఇద్దరు చెల్లెలకు అప్పుచేసి వివాహం జరిపించాడు.. అప్పుకూడా తీరలేదు, కుటుంబ భారం మొత్తం గఫర్ పైనే ఉంది.
ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని,వాళ్లకి ఉద్యోగాల్లేవని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వాళ్లని ఉద్యోగంలోకి తీసుకునేది లేదని ఆయన అంటున్నారు.
ఇంతపెద్ద తెలంగాణా తీసుకు వచ్చాను,నేను ఏది చేసినా, అంటే ఆర్టీసిని ప్రైవేటుపరం చేసినా, అమ్మినా, తాకట్టుపెట్టినా అంతా బంగారు తెలంగాణా కోసమే నని ఆయనచెబుతున్నారు.
కార్మికనేతలే మో ఇందులో బంగారు తెలంగాణలేదు, బంగారు మాత్రమే ఉందంటున్నారు. ఆర్టీసిని ప్రయివేటు పరం చేసి, ఆర్టీసికి డిపోలో రూపంలో ఉన్నభూములను కాజేసే కుట్ర ఉందని కార్మికులంటున్నారు.
దీనితో ప్రతిష్టంభన ఏర్పడింది.
కోర్టు చెప్పినా కేసిఆర్ చర్చ ల్లేవు గిర్చల్లేవ్ అంటున్నారు.
ఇలాంటపుడు గఫార్ వంటి చిన్నకుటుంబాలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడలేవు. ఒక నెల జీతం రాలేదు.మరొక నెలాఖరు దగ్గరకు వస్తున్నది. అపుడుకూడా జీతంవస్తుందన్న గ్యారంటీ లేదు. రేపు కోర్టు జీతం ఇవ్వమని చెప్పినా, ఆర్టీసి దగ్గిర డబ్బుల్లేవు అని చెప్పి ముఖ్యమంత్రి జీతం ఇప్పించకపోవచ్చు.తనను ధిక్కరించిన ఆర్టీసి కార్మిక సంఘాల కసితో రగిలిపోత్నారు. ఇలాంటి కసి రాజకీయాలలో గఫార్ లాంటి వాళ్లు రాలిపోతుంటారు. ఈ రోజు ఆర్టీసి సమ్మె 19 వ రోజు.
18వ రోజు మంగళవారం రాత్రి 9:20 నిమిషాలకు మృతిచెందినట్టు బందువులు, కుటుంబసభ్యులు తెలిపారు.
మృతుడు గఫర్ కు 2018 ఆగష్టు 3వ తేదీన వివాహం జరిగింది. ఇతనికి నాలుగు నెలల పాపకూడా ఉంది. గత మూడు రోజులుగా తీవ్ర మనస్తాపంతో, కుటుంబ సబ్యులగురించి, తీవ్రంగా ఆలోచిస్తూ సరిగ్గా బోజనం కూడా చేయకుండా,కార్మికుల సమ్మే గురించి, ఆర్టీసీ కార్మికుల భివిష్యత్ గురించి ఆలోచిస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయాడని చెబుతున్నారు.
కుటుంబసభ్యులు అతనిని మెదక్ ఆసుపత్రికి తీసుకు వెల్లగా, తమవల్ల కాదని,హైద్రాబాద్ తీసుకు వెల్లండని డాక్టర్ చెప్పడంతో చేగుంటవరకు వేల్లేలోపే గఫర్ మృతి చెందాడు