అబ్బో, జగన్ కి 100 కి 150మార్కులేయాల్సిందే : జెసి సీనియర్

ఆంధ్రప్రదేశ్ లో   దివాకర్ ట్రావెల్స్  బస్సులను సీజ్ చేసి, కేసులు పెట్టి,పర్మిట్  జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు.

 

గంటూరు లో ఈ రోజు మాట్లాడుతూ  జగన్ పాలన చాలా  జనరంజకంగా సాగుతోంది వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇందుకు గాను ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  పాలనకు 100కి 150మార్కులు ఇవ్వాల్సిందే నని అన్నారు.

 ఈ కోపానికి కారణం, నిన్న జరిగిన విషయాలే. నిన్నఏంజరిగిందంటే…

జెసి బ్రదర్స్  (దివాకర్ ట్రావెల్స్)కు చెందిన బస్సులు నిబంధలను ఉల్లంఘించిందున కేసులు బుక్ చేసినట్లు  రవాణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

31స్టేజ్ క్యారియజ్, 18 కాంట్రాక్టు క్యారియజ్ బస్సులపై కేసులు నమోదు చేశారు. పర్మిట్ రద్దు చేశారు.

దివాకర్ ట్రావెల్స్ యజమానులు మోటార్ వాహనాల చట్టాలు మరియు అన్ని రకాల నిబంధలను ఉల్లంఘించారని వారు ప్రకటించారు.

బస్సులను తిప్పుతూ  రహదారి భద్రత నిబంధలను అతిక్రమించి, ప్రభుత్వాన్ని , ప్రయాణికులను మోసం‌ చేశారని వారు పేర్కొన్నారు.

రూల్స్ కు‌ విరుద్దంగా తిరుగుతున్న 31స్టేజ్ క్యారియజ్ బస్సులను, 18కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను సీజ్ చేశామని చెప్పారు.  అన్ని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు.

ఈ బస్సు ల  ఇన్సురెన్సులు కూడ నకిలీవని ఫిర్యాదులు అందాయని,  వీటిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నదని వారు చెప్పారు.

దీని మీద జెసి సీనియర్ స్పందించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే…

రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి నా బస్సులే కనిపిస్తున్నాయి.

నాకున్న ఎన్నో బస్సుల్లో ఇప్పటి వరకు 31బస్సులు సీజ్ చేశారు. దీనిపై న్యాయపరంగా పోరాడతాం.

70ఏళ్ల నుంచి వాహనరంగం లో ఉన్నా.చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజం.

నా బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారు.ఫైన్ లతో పోయే తప్పిదాలను సీజ్ చేయటం ఎంతవరకు సబబు.

జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మా అబ్బాయే. పరిపాలన లో కిందా మీద పడుతున్నాడు.

ఎన్నికల్లో పోటీ చేయనని మాత్రమే నేను రాజకీయ సన్యాసం తీసుకున్నా.రాయలసీమ అభివృద్ధి చూసే వారి కళ్లను బట్టి ఉంటుంది.

ఎవరి ప్రాంతం అభివృద్ధి కావాలనే వారు కోరుకోవడంలో తప్పులేదు,

చంద్రబాబు సాగునీటి ప్రాజెక్ట్ లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఎన్ని వర్షాలు పడిన ప్రాజెక్టులు లేకపోతే ఫలితం శూన్యం.