బెంగాల్ ఇపుడు బాగా రగులుతున్న రాజకీయయుద్ధ భూమి. మన సిష్టమ్ లో కేంద్రానికి రాష్ట్రానికి విబేధాలొస్తే రోజూగొడవలొచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రాలు స్వతంత్ర ప్రభుత్వాలైనా అక్కడ రాజభవన్ మాత్రం కేంద్రం అధీనంలో ఉంటుంది. అందులో తిష్ట వేసిన గవర్నర్ కేంద్ర ప్రతినిధి. అందులో రూలింగ్ పార్టీ వాళ్లను గవర్నర్లు నియమించే సంప్రదాయమున్నపుడు గవర్నర్ మీద రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు చాలాఅనుమానాలంటాయి.
అందునే ఇక ప్రభుత్వాలు ప్రత్యర్థిపార్టీలవయితే టెన్షన్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఇపుడు బెంగాల్ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూ ఉంది.గవర్నర్ జగదీప్ ధంకర్ మీద మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించింది. ధంకర్ బాగా కోపమొచ్చింది.
మంగళవారం నాడు నార్త్,సౌత్ 24 పరగణాల జిల్లాల పర్యటనలకు ఆయన వెళ్లారు.
మొదట ధమఖాలీ లో ఒక సమావేశానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ఒక్కరూ మీటింగ్ కు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద చిందులేశారు. ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకం (Unconstitutional) , గవర్నర్ మీద సెన్సార్ షిపా అని అరిచారు.
గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంకింద పనిచేయడం లేదని (I am not subordinate to the state government)అని గద్దించారు. నాకు నచ్చలేదన్నారు.
ఇంతకీ జరిగిందేమింటే, గవర్నర్ ధమఖాళీ జిల్లా అధికారులతో సమావేశం పెట్టుకున్నారు. అధికారులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను పిలిచారు.
ఈ ఇంటారాక్టివ్ సెషన్ ను అంతా బహిష్కరించారు. ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్లు ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చారు. సమావేశం హాలంతా ఇలా ఖాళీగా ఉండటంతో ఆయనకు చిర్రెత్తు కొచ్చింది.
గవర్నర్ జిల్లా అధికారులతో మాట్లాడాలనుకున్నపుడు ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. చివర ఎవరూ రాలేకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు.
అధికారులంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి వెళ్లారని ఆయనకు స్వాగతం చప్పేందుకు వచ్చిన అధికారులు చెప్పారు.
ముఖ్యమంత్రి సమావేశంఏర్పాటుచేయవచ్చు, కాని ప్రభుత్వానికి హాలిడే కాదుగా అని ఆయన ప్రశ్నించారు.
దీనికి కారణం ఏమిటి?
గవర్నర్ ఇలా అకస్మిక సమీక్షా సమావేశాలునిర్వహించవచ్చా?
ఇదే రాజ్యంగ సమస్య.
ఇలా గవర్నర్ ఉన్నఫలాన తనకు తాను సమావేశం ఏర్పాటుచేయరాదని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తే వారు ఏర్పాటుచేస్తారని సోమవారం నాడు ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లా కలెక్టర్లు రాజ్ భవన్ కు లేఖ రాశారు.
ఎందుకంటే, అధికారులంతా ఇలా మూకుమ్మడిగా ఒక సమావేశానికిరావాలంటే ప్రభుత్వం అనుమతి అవసరమని వారు లేఖలో చెప్పారు.
ఇది కూడ గవర్నర్ కు నచ్చలేదు.
సమావేశం ఏర్పాటుచేస్తున్నానని ఆహ్వానం పంపిన నాలుగు రోజుల తర్వాత కలెక్టర్లు ఇలాంటి లేఖ రాస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సెన్సార్ షిప్ నడుస్తూ ఉందా అని ప్రశ్నించారు.
ఇదేసమస్య.
గవర్నర్ హెడ్ అఫ్ ది స్టేట్. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం దగ్గర నుంచి సమీక్షా సమావేశాలు ఏర్పాటుచేసే దాకా అధికారాలుంటాయి.అయితే, వాటిని అమలు చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. మర్యాద ఉంటుంది.
ఈ మర్యాద ప్రకారం, తాను ఒక సమావేశం ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు గవర్నర్ చీఫ్ సెక్రెటరీకి తెలియచేస్తే ఆయనే సమావేశాలు ఏర్పాటుచేసి ఇలాంటి తలనొప్పి లేకుండా చేస్తారు.
తాను గవర్నర్ , ఏదైనా చేయవచ్చని అనుకున్నపుల్లా గొడవలొచ్చాయి.
అసలు ఈ గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలనే నినాదం కూడా వచ్చింది గతంలో.
గవర్నర్ ముఖ్యమంత్రి వారానికొకసారి కలుసుకుని బుకే లిచ్చుకుని కొరుకుతూ కాఫీ టీ సేవిస్తూన్నంతక కాలం యవ్వారం బాగానేఉంటుంది.
ఇది సాగకపోతే అన్నీ సమస్యలే.
తెలంగాణలో ఏమవుతుందో చూడాలి. ఈ గవర్నర్ ని ముఖ్యమంత్రి కెసిఆర్ మునుపటి గవర్నర్ నరసింహన్ లాగా చూసే అవకాశమేలేదు.