ఎలాంటి గొడవ లేదు. దివాకర్ (జెసి) బ్రదర్సెవరూ విజయవాడ పరిగెత్తుకుంటూ వచ్చి రవాణా శాఖ కమిషన్ కార్యాలయం దగ్గిర ధర్నాచేయలేదు గతంలో లాగా. అంతా నిశబ్దంగా జరిగిపోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రిపబ్లిక్ ను దశాబ్దాలుగాపాలించిన జెసి బ్రదర్స్ (దివాకర్ ట్రావెల్స్)కు చెందిన బస్సులు నిబంధలను ఉల్లంఘించిందున కేసులు బుక్ చేసినట్లు రవాణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
31స్టేజ్ క్యారియజ్, 18 కాంట్రాక్టు క్యారియజ్ బస్సులపై కేసులు నమోదు చేశారు. పర్మిట్ రద్దు చేశారు.
దివాకర్ ట్రావెల్స్ యజమానులు మోటార్ వాహనాల చట్టాలు మరియు అన్ని రకాల నిబంధలను ఉల్లంఘించారని వారు ప్రకటించారు.
బస్సులను తిప్పుతూ రహదారి భద్రత నిబంధలను అతిక్రమించి, ప్రభుత్వాన్ని , ప్రయాణికులను మోసం చేశారని వారు పేర్కొన్నారు.
రూల్స్ కు విరుద్దంగా తిరుగుతున్న 31స్టేజ్ క్యారియజ్ బస్సులను, 18కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను సీజ్ చేశామని చెప్పారు. అన్ని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు.
ఈ బస్సు ల ఇన్సురెన్సులు కూడ నకిలీవని ఫిర్యాదులు అందాయని, వీటిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నదని వారు చెప్పారు.
ఇలా దివాకర్ ట్రావెల్స్ మీద ఇన్ని చర్యలు తీసుకోవడం, దాని మీద ఎలాంటి తిరుగుబాటురాకపోవడం ఇదే ప్రథమం. సాధారణంగా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న దివాకర్ బ్రదర్స్ జోలికి ఎవరూ వెళ్లరు. వెళితే చాలా పెద్ద సమస్య అవుతుంది.
2017 మార్చి లో దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సొకటి విజయవాడ సమీపం పెనుంగచిప్రోలు మండలం ముల్లపాడు వద్ద కల్వర్ట్లు ను ఢీ కొని 22 అడుగుల కింద ఉన్న వంకలో పడిపోయింది. అపుడు 10 మంది చనిపోయారు. అపుడు దివాకర్ రెడ్డి టిడిపి ఎంపి. ఆయనసోదరుడు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే. జాతీయ రహదారి మీద 110 కిమీ వేగంతో వెళ్లూ డ్రయివర్ నిద్ర మత్తులో తూలడంతో ఈ ప్రమాదం జరిగింది. అపుడు బస్సు ఎంత మంది డ్రైవర్లను నియమిస్తున్నారనే దాని మీద పెద్ద జరిగింది. ఈ బస్సు గురించి విచారణలో ఆసక్తికరమయిన విషయాలు వెళ్లాయి. ఈ బస్సు అటు ఆంధ్రలో గాని, తెలంగాణలో కాని రిజిస్టరేకాలేదు. అయినప్పటికీ ఈ కేసు మాయమయింది. బస్సు అపరేటింగ్ కంపెనీ మీద కేసు నమోదు కాలేదు. తర్వాత దివాకర్ ట్రావెల్స్ కు రవాణా శాఖ,లేబర్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు దీనిని ప్రశ్నించింది. లేబర్ డిపార్ట్ నుచివాట్లు పెట్టింది. తర్వాత 2017 డిసెంబర్ లో హైదరాబాద్ లో ఆర్ టి ఎ వద్ద ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పెద్ద గొడవ చేశారు. అపుడు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు, ప్రభాకర్ రెడ్డిపెద్ద వాగ్వాదం నడిచింది. తాను ఆంధ్ర వాడినైందునే తన బస్సుల మీద చర్య లుతీసుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అపుడాయను అరెస్టు కూడా చేశారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులకు పర్మిట్లు లేవనన్నది ఆరోపణ. తనకు 44 బస్సులున్నాయని వాటన్నింటికి పర్మిట్లు ఉన్నాయని ప్రభాకర్ రెడ్డి వాదించారు. స్టే జ్ క్యారియర్ పేరుతో దివాకర్ ట్రావెల్స్ ట్రావెల్ బస్సులు నడుపుతున్నారని దీనితో టిఎస్ ఆర్టీసికి నష్టం వస్తున్నదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.