ఇసుక లేక నిర్మాణం పనులు లేక రోడ్డున పడ్డాం, మా కుటుంబాల్ని ఆదుకోవాలి , దండిగా డబ్బు ఉన్న సంక్షేమ బోర్డు నుంచి నెలకు పది వేల రూపాయల చొప్పున కరవు భత్యం ఇవ్వాలి. ఇది వారి డిమాండ్. వారంత అయిదారు నెలలుగాపనుల్లేక అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులు.
ఇది చాలా న్యాయమయిన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చడం వల్లప్రభుత్వ మీద పడే భారమేమీలేదు.
ఎందుకంటే, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక బోర్డు ఏర్పాటుచేసింది. దీనికి నిర్మాణాలుచేపట్టేవారంతా ఒక శాతం సెస్ కడతారు. ఇది వందల కోట్లలో వసూలయి ఉంటుంది. ఈ డబ్బు ఉండేది వారి సంక్షేమ కోసమే. అందులోనుంచి ఇసుక సమస్య పరిష్కారమై, మళ్లీ తమకు కూలిపనులు దొరికే దాకా మాత్రం నెలకు పది వేలివ్వాలంటున్నారు వారు.
జగన్ ను ఇరుకున పెట్టే డిమాండ్. ఎందుకంటే, నిధులు లేవనడానికి వీల్లేదు. నిధులు దండిగా ఉన్నాయి. ఇవేవి ప్రభుత్వ నిధులు కాదు.
జగనన్న అందరికి ఏదో ఒక రూపంలో డబ్బులిస్తున్నాడు. పెన్షన్లు పెంచాడు, జీతాలుపెంచాడు, నాలుగున్నర లక్షల ఉద్యోగాలిచ్చాడు, రైతు భరోసాతో రైతులకు డబ్బిస్తున్నాడు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అందువల్ల తమకూ ఇవ్వవచ్చు అని వారు వాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దొరకక నిర్మాణ రంగంలో పనులాగి పోయిన సంగతి తెలిసిందే.
అన్నిరాజకీయ పార్టీలు దీనిమీద ఉద్యమం చేస్తున్నాయ్. తెలుు దేశం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష చేశాడు. నవంబర్ మూడో తేదీన జనసేన నేత విశాఖర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఈ రోజు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సి ఐ టి యు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇలా వినతిపత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది.
ఇలా వందల సంఖ్యలో విజయవాడ నార్త్ మండల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వినతి పత్రాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పిలుపునకు స్పందించి భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనిదరఖాస్తుల్ని ఎం. ఆర్. ఓ.కి అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సి హెచ్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వంవైఖరి మూలంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని,నూతన పాలసీని ప్రకటిస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంఇప్పటి వరకు పూర్తిస్థాయి లోఇసుకని అందుబాటులోకి తీసుకురాలేదని అన్నారు.
ఇసుక లేక పని లేక భవన నిర్మాణ కార్మికులు కొన్ని నెలలుగా ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారని,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నానని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకమిదని ఆయన విమర్వించారు.
భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు కనపడకపోవడం,కార్మికుల కష్టాలను పట్టించుకోకపోవటం సరైంది కాదని అంటూ రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్నిరాష్ట్ర ప్రభుత్వంఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచిపని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికీ నెలకి పదివేల రూపాయల చొప్పునఇవ్వాలనిఆయనప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి,కార్మికుల కుటుంబాన్ని ఆదుకోకపోతేపెద్ద ఎత్తునభవన నిర్మాణ కార్మికులు నవంబర్ ఒకటో తారీఖున సామూహిక రాయబారాలు పేరుతోవిజయవాడ నగర రాజధానికి తరలి రాబోతున్నారు.
ప్రభుత్వంవెంటనే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులుకె.దుర్గారావు, అర్గనైజింగ్ కార్యదర్శిపి. మాధవ్,అధ్యక్ష కార్యదర్శులు,పివి సుబ్బారావు,బి గోవింద్, బి. రమణారావు,స్థానిక నాయకులుకె. సత్యనారాయణ,అప్పల నాయుడు,శంకర్,కన్నా,గంగాధర్,గిరి,రామయ్య,ఆదిబాబు,తదితరులు పాల్గొన్నారు.