అదంతే, మనింట్లో ట్రాష్ ఇంకొకరికి క్యాష్.
చెత్తనంతా ఏరుకుని కుప్పవేసి, అందులో ఏమున్నాయో విడదీసి వాటికి పాలిష్ చేసి సొమ్ము చేసుకోవడం మనకు తెలుసు.
మనంచదివి ఇక పనికి రావని పడేసే న్యూస్ పేపర్లు అవతలి వాళ్లకి పెద్ద బిజినెస్. ఇలాంటి ’చెత్త‘ బిజినెస్ కు పరాకాష్ట చెత్త నుంచి విద్యత్తు.
అయితే, టర్కీ రాజధాని అంకారాలోని చెత్త ఏరివేసే వాళ్ల (Garbage collectors) కు కొత్త ఆలోచన వచ్చింది.
రోజు వాళ్లచెత్తలో ఎన్నో పాత పుస్తకాలు కనిపిస్తున్నాయి. వాటిని కూడా చెత్తలో భాగంగా ఎక్కడో పడేసి కాల్చేయడమో,గోతుల్లో పూడ్చేయడమో చేస్తున్నారు. ఇదేం పద్ధతి అనుకున్నారు.
వీటిని ఇంతకంటే గొప్పగా వినియోగంలోకి తీసుకురాలేమా అని ఆలోచించారు. మనుసుంటే మార్గం ఉంటుంది కదా.
వెంటనే ఆపుస్తకాలన్నింటిని చెత్త నుంచి వేరు చేశారు. ఇపుడేం చేయాలి? పాతపుస్తకాల షాపులకు అమ్మేశారా కాదు.వాటితో లైబ్రరీ ఏర్పాటుచేయాలనుకున్నారు.
అసలీ ఆలోచన ఎలా వచ్చిందంటే… ఒక రోజు శానిటేషన్ వర్కర్ డుర్సాన్ ఐపెక్ కు ఒక పెద్ద సంచి దొరికింది.
అందులో ఏమున్నాయో చూస్తే ,దాన్నిండా చక్కటి పుస్తకాలున్నాయి. వీటిన్ని డంప్ యార్డ్ లో పడేసేందుకు ఆయనకు మనసొప్పలేదు.ఇతర వర్కర్లతోచర్చించాడు. ఇలాంటిపుస్తకాలు సేకరిస్తే బాగుంటుందని అందరిచెప్పాడు.
అంతే,ఆ రోజు నుంచి చెత్తలో ఉండే పుస్తకాలన్ని గుట్టగుట్టలుగా పోగవడం మొదలయింది.
వీళ్లిలా పుస్తకాలు సేకరిస్తూ ఉండటం స్థానికులు ఆసక్తిగా గమనించారు.
వాళ్లూ పుస్తకాలు డొనేట్ చేయడం మొదలుపెట్టారు.దీనితో పుస్తకాలు గుట్టలు గుట్టలుగా జమయ్యాయి.
పెరిగిపోతున్నపుస్తకాల గుట్టను ఎక్కడకి తరలించాలి?
చివరకు వారు పనిచేస్తున్న క్యాంకియా ప్రాంతంలో ఉండే శానిటేషన్ హెడ్ క్వార్టర్స్ లో ఒక పాత ఇటుకల బట్టీ ఉంది. పుస్తకాలనుదాంట్లోకి తరలించారు.దీనికి మేయర్ నుంచి కూడా ఆమోదం లభించింది.
పాతపుస్తకాలకొక పాత నీడ కూడా దొరికింది. ఒక లైబ్రరీగా కొత్త అవతారమెత్తింది.
ఇపుడా లైబ్రరీలో ఆరువేల పుస్తకాలున్నాయి.
మొదట్లో ఈ పుస్తకాలను వర్కర్లు కుటుంబ సభ్యులకు మాత్రమే అరువిచ్చే వాళ్లు. ఇపుడు పుస్తకాల సంఖ్య పెరుగిపోతూ ఉండటం,లైబ్రరీ చక్కగా తయారు కావడంతో ప్రజలందరికి ప్రవేశం కల్పించారు.
సాహిత్యం నుంచి సాధారణ పుస్తకాల దాగా అన్ని సబ్జక్టుల మీద ఇక్కడపుస్తకాలున్నాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల పుస్తకాలు కూడా ఉన్నాయి.
చిన్న పిల్లలకు ఒక విభాగం తయారయింది. పుస్తకాలను రెండువారాలదాక అరువిస్తారు. అసవరమయితే పొడిగిస్తారు.
ఈ లైబ్రరీ వచ్చాక నిర్వాహకులు ఒక కొత్త విషయం కనిపెట్టారు.
కొంతమందికి తమ దగ్గిర ఉన్నపుస్తకాలతో అవసరం లేదు, అయితే, మరొక వైపు అదే పుస్తకాల కోసం మరికొందరు వెదుకుతున్నారు.
ఈ ఇద్దరిసమస్యను లైబ్రరీ పరిష్కరించడంతో ‘చెత్త’ పుస్తకాల లైబ్రరీ ఐడియా సూపర్ హిట్టయింది.
ఇపుడు టర్కీ దేశ గ్రామీణ ప్రాంతాలలో ఉండే పాఠశాలల వాళ్లంతా ఈపాతపుస్తకాల విలువ తెలుసుకుని వాటిని తీసుకుపోయి చదవుకుంటున్నారు.
శానిటేషన్ వర్కర్లు నడుపుతున్న ఈ లైబ్రరీ విజయవంతం కావడంతో లోకల్ మునిసిపాలిటీ ఒక ఫుల్ లైబ్రేరియన్ ను కేటాయించింది. ముఖ్యంగా సైక్లిస్టులలో ఈలైబ్రరీ బాగా పాపులర్ అయింది.
ఎందుకంటే ఈ ప్రాంతంలోని లోయల్లోకి సైక్లింగ్ చేసుకుంటే వచ్చే వాళ్లంతా ఈ లైబ్రరీ దగ్గిర ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక కప్పు టీ తాగి ,రెండు పుస్తకాలు తిరిగేసి సేద తీర్చుకుని పోతున్నారు.
ఒకపుడు మాయింట్లో ఒక పుస్తకాల లైబ్రరీ ఉండాలని కలగనేవాడిని. ఇపుడే ప్రత్యేక ఇంత లైబ్రరీ ఏర్పాటుచేశామని సరాత్ బేతేమూర్ అనే చెత్త పోగేసే ఉద్యోగి గర్వంగా చెప్పాడు.
Photos CNN