చాలా కాలేజీల్లో లేదా స్కూళ్లలో కాపీలు కొట్టించి పరీక్ష రాయించడం ఒక పద్ధతి. కొన్ని కాలేజీల వాళ్లు కాపీ పరీక్షలను నివారించేందుకు నానా ఆగచాట్లు పడుతుంటారు.
కాపీ కొట్టకుండా ఉండేందుకు విద్యార్థుల మీద రకరకాలుగా నిఘా పెడుతూంటారు.
హాల్లోపలకాపీలు జరుగకుండా ఉండేందుకు ఈ మధ్య పరీక్షల హాల్లోకి సిసి టివిలు వచ్చాయి.
బయటనుంచి కాపీ చిట్టీలు రాకుండా ఉండేందుకు బయట పోలీసులకాపలపెడుతూనే ఉన్నారు. అయినాసరే కాపీలు ఆగడం లేదు. విద్యార్థులు కూడా కాపీలు కొట్టేందుకు కొత్త మార్గాలు కనిపెడుతూ ఉంటారు.
పక్కవాడి పేపరు చూసి రాయడం కూడా కాపీయే కదా.
దీన్ని నివారించడమెలా? కాపీలు కొట్టడమనేది పరీక్షలు మొదలయినప్పటి నుంచి ఉంటున్న అలవాటు.
కాపీల్లేకుండా పరీక్షలురాయించడమనేది ఉత్తమ లక్ష్యమే. అయితే, ఏరకంగానూ కాపీ జరగరాదు,చివరకు పక్కవాడి పేపర్ నుకూడా చూసి కాపి కొట్ట రాదని ఒక ప్రిన్సిపాల్ భీష్మ ప్రతిజ్ఞ చేసి ఈ ఉత్తమ లక్ష్యం సాధించాలనుకున్నాడు.
పక్కవాడిని చూసి కాపీ కొట్టకుండా ఉండేందుకు ఆయన ప్రిన్సిపల్ కొత్త ప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలోని హవేరీలో జరిగింది.
అక్టోబర్ 16 వ తేదీన భగత్ ప్రియూనివర్శీటీ కాలేజీ విద్యార్థులు అర్థ సంవత్సరం పరీక్షకు కూర్చుంటున్నారు. వాళ్లెవరూ కాపీ కొట్టకుండా ఉండేందుకు తలమీద హెల్మెట్ లాగా ప్రత్యేకంగా తయారు చేసిన అట్టపెట్టెలను పెట్టుకోవాలని ప్రిన్సిపాల్ ఆదేశించాడు.
ఈ అట్టపెట్టెలకు ఒక వైపు తెరచి ఉంటుంది. ఆవైపు నుంచి చూస్తూ పరీక్షలురాయాలి.
ఈ పెట్టె తలకు తగిలించుకుంటే మరొక వైపు చూసేందుకు వీలుండదు. ఇక దీనితో కాపీలు నివారించవచ్చని కాలేజీ అడ్మినిస్ట్రేటర్ ఎం బి సతీష్ భావించాడు.
అంతేకాదు, తమ ప్రయోగం గురించి ప్రపంచానికి తెలియచెప్పేందుకు పెట్టెలు పెట్టుకున్న విద్యార్థలు పరీక్ష రాస్తున్నప్పటి ఫోటోతీసి వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు.
ఈ కాలేజీచేస్తున్న ప్రయోగం గురించి మధ్యాహ్నం 12 గంటలపుడు ప్రి యూనివర్శిటీ ఎజుకేషన్ డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఎస్ సి పీర్జాదాకు తెలిసింది. ఆయనవెంటనే కాలేజీకి పరుగుపెట్టి పరిస్థితి చూశాడు.
విద్యార్థులందరి తలకాయల మీద పెట్టెలున్నాయి. ఇదేంటని ప్రశ్నించాడు. కాలేజీకి షోకాజ్ నోటీసుఇచ్చారు. అయితే, కాలేజీ మాత్రం తమది గొప్ప ప్రయోగమనే వాదించింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్ సురేష్ ఏకంగా ఫేస్ బుక్ ఎక్కి ఇది ఆమోదయోగ్యం కాదని , విద్యార్థులను ఇలా ట్రీట్ చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పాడు.
అయితే, కాలేజీ మేనేజ్ మెంట్ మాత్రంమేనేజ్ మెంట్ బోర్డు సభ్యుడు ఎంసతీష్ తీసుకున్న ఈచర్యను సమర్థించింది.
బీహార్ లో ఈ విధానం మొదలయిందని, దీనికి బాగాప్రశంసలొచ్చాయని, అంందుకేతాము కూడా ఈ విధానం అమలుచేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే, డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ మాత్రం ఈవాదనతో ఏకీభవించలేదు.
హవేరీ కాలేజ్ ప్రిన్సిపాల్ ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.