ముఖేష్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ రిటైల్ లో దీపావళి ముందే వచ్చింది.
దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినా రిలయన్స్ రిటైల్ వ్యాపారం దుమ్మురేగ్గొట్టి కనివిని ఎరుగని లాభాలు తెచ్చెపెట్టింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రెండోక్వార్టర్లో 27 శాతం అభివృద్ధి చూపించి రు.41,202 కోట్ల వ్యాపారం చేసింది.
జూలై-సెప్టెంబర్ క్వార్టర్ (Q2)లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రు. 11,262 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో నెట్ ప్రాఫిట్ రు.9516 కోట్లు మాత్రమే.
రిటై ల్ బిజినెస్ EBITDA(Earnings before interest, taxes, depreciation, and amortization) 13 శాతం పెరిగి రు.2323 కోట్లకు చేరింది.
రిలయన్స్ టెలికాం,జియోల నుంచి వచ్చిన లాభం రు. 990 కోట్లతో పోలిస్తేఇది చాలా ఎక్కువ.
ఈమేరకురిలయన్స్ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.