కొన్ని ప్రభుత్వం రంగ జాతీయ బ్యాంక్ ల విలీనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక రోజుజాతీయ సమ్మెలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు నిర్ణయించాయి. సమ్మె అక్టోబర్ 22న జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం హిమాయత్ నగర్ లోని కామ్రేడ్ సత్యనారాయణ భవన్ లో జరిగింది. సమావేశంలో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు పాల్గొన్నాయి. ప్రధాన కార్యదర్శి తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య రాంబాబు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్ లు గా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూన్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల విలీనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్రగతి నిరోధకచర్య అని 10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందని ఆయన అన్నారు.
ఆయన ఇంకే మన్నారంటే… ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలినాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వ చర్య తో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుంది. బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారు దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుంది. కేంద్రప్రభుత్వం బ్యాంక్ ల సంస్కరణల పేరుతో కార్పొరేట్ సంస్థలకు దగ్గర అవుతుంది.