టి .ఆర్ .ఎస్ .పార్లమెంటరీ పార్టీ నేత డా .కె .కేశవ రావు అంటే బాగా చదువుకున్నాయన. ఆయన ఎపుడో ఈ కాలపు పోరగాల్లెవరు పుట్టక ముందు ఫిలాసఫీలో డాక్టరేట్ చేశారు. కొద్ది రోజులు పాఠాలుకూడా చెప్పారు. తర్వాత జర్నలిజంలోకి వచ్చారు.తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ఆయన ధోరణి ఫిలసాఫికల్ .
అందుకే ఆయన ఏదయిన మాట్లాడితే అంత ఈజీగా అర్థం కాదు. దానికో డిక్షనరీ కావాలి. ఆయన కాంగ్రెస్ లో ఉండి అనేక ఉన్నతపదవులు చేపట్టి, ఇతర సాదాసీదా పొలిటీషన్లలాగే తర్వాత మరింత ఉన్నతంగా ఎదిగేందుకు టిఆర్ ఎస్ లో చేరారు.
ఇలా ఆయన అలా తెలంగాణాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఇపుడు ఆర్టీసి 48వేల మంది సమ్మెకు దిగారు. సమ్మె ఆయనకు నచ్చడం లేదు.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చేయడం తప్పంటున్నారు. అది పాలసీ వ్యవహారం, పాలసీ వ్యవహారాలను ప్రశ్నించరాదంటున్నారు.
కార్మికులు సమ్మెచేసేదే పాలసీ వ్యవహారాలను మార్చాలని. దీనికి చాలా చరిత్ర ఉంది. కేశవరావు లాంటి మహా మేధావికి ఇది తెలియనిదా? ఆశ్చర్యం.
ఈ విజ్ఞానంతో ఆయన తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సుకో్రి ప్రజలకోసం క్రింది ప్రకటన జారీ చేశారు. ముఖ్యంగా ఈ ప్రకటనలో ఆయన ఆర్టీసి కార్మికులకు తత్వ బోధ చేశారు.
సోమవారం (14 th అక్టోబర్ ,2019 )నాడు హైదరాబాద్ లో డాక్టర్ కె కేశవరావు (కెకె) విడుదల చేసిన పత్రికా ప్రకటన లో ప్రధానాంశాలు
*ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే బాలే. ఇవి నన్ను బాధించాయి .ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం తీసుకురాదు.
*పరిస్థితులు చేదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమించాలి. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలి
*ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం అనే డిమాండ్ తప్ప ఆర్టీసి కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్ల ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి
*ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతం లో గొప్పగా పరిష్కరించింది .44 శాతం ఫిట్ మెంట్ ,16 శాతం ఐ ఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానిదే .
“ఆర్టీసీ ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ఇటీవలే తేల్చిచెప్పారు .అందుకు ఆయనను అభినందిస్తున్నా.అద్దె బస్సులు ,ప్రైవేట్ స్టేజి క్యారేజీ ల విషయం లో కెసిఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యం లో తీసుకున్న నిర్ణయం గా మాత్రమే చూడాలి
*నేను 2018 అసెంబ్లీ ఎన్నికల టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నాను .ఆర్టీసీ ని ప్రభుత్వం లో కలిపే ప్రతిపాదనేది మా ఎన్నికల ప్రణాళిక లో చేర్చలేదు .ఆర్టీసీ యే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని మేనిఫెస్టో లో పేర్కొన లేదు
“ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే విధానాన్ని (పాలసీ )మార్చుకోవాలని కోరడమే .ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం