నిన్ననే చైనా అధ్యక్షుడు షీ జిన్ పిింగ్ కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య రెండు దేశాల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి.
కాశ్మీర్ వంటి అంశాలలో మీద విబేధాలున్నా, అలాంటి వాటిని పక్కన బెట్టి కలసి ఎలా పనిచేయాలనే దాని గురించి ఇద్దరు నేతలు చర్చించారు.
అయితే, నిజానికి రెండు దేశాల మధ్య చాలా విషయాల్లో పోటీ ఉంది. రెండు ఆసియాలో పెద్ద ఆర్థిక వ్యవస్థలు.ఇప్పటికే చైనా ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. అయితే, చైనాను అధిగమించేందుకు భారత్ కృషి చేస్తూ ఉంది. చైనా ఆర్థిక రంగంలో భారత్ అధిగమిస్తుందో లేదో గాని 2027 నాటికి ఒక విషయంలో మాత్రమ్ చైనాని భారత్ దాటిపోతుంది.
ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రపంచమంతా దానిని ఆమోదించింది. ఆదే విషయంటే… జనాభా. ఐక్యరాజ్యసమితి 2019 పాపులేషన్ ప్రొజక్షన్స్ (World Population Prospects) మరొక 8 సంవత్సరాలలో అంటే 2017 నాటికి భారత జనాభా చైనా జనాభాను మించిపోతుందని లెక్కకట్టారు.
అక్టోబర్ 12,1999 ప్రాముఖ్యత తెలుసా?
ప్రపంచ జనాభా లెక్కలకు సంబంధించి అక్టోబర్ 12,1999 కి చాలా ప్రాముఖ్యం ఉంది. నిన్నటికి అంటే అక్టోబర్ 12,2019 నాటికి ఈ తేదీ 20 యేళ్ల కిందటిది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA Unted Nations Fund for Population Activities)ఈ తేదీని 6 బిలియన్ జనాభా దినం ( the Day of 6 Billion) గా ప్రకటించింది. అంటే అక్టోబర్ 12 1999 నాటికి ప్రపంచ జనాబా 6 బిలియన్లకు చేరుతుందని ఆ రోజు అంచనా వేశారు. ఆరోజు బోస్నియా, సరయేవోలో ఫాతిమా హెలక్, జాస్మింకో మెవిక్ లకు మొదటి కుమారుడు అడ్నాన్ మెవిక్ పుట్టడంతో జనాభా 6 బిలయన్ లకు చేరుకుందని ప్రకటించారు. ఇదొక అంచనా మాత్రమే.
ప్రపంచ జనాభా ఎంత వేగంగా సమితి the Day of 6 Billion ని ప్రకటించింది. 1804లో ప్రపంచ జనాభా కేవలం 1 బిలియన్ మాత్రమే. ఈ బిలియన్ స్థాయికి ప్రపంచ జనాభా చేరేందుకు లక్షల సంవత్సాలుపట్టింది. అయితే, 1804 నుంచి 1960 నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్ లకు చేరింది. ఆతర్వాత 40 సంవత్సరాలలోనే ఈ జనాభా 6 బిలియన్ లకు చేరింది.
2011 నాటికి ప్రపంచ జనాభా 7 బిలియన్ల కు చేరింది. నిన్నటికి అంటే అక్టోబర్ 12, 2019 నాటికి జనాభా 7.7 బిలియన్ లకు దాటింది. అది ఈ తేదీ ప్రాముఖ్యం.
ప్రపంచ జనాభా ఇంకా పెరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల కిందట జానాభా శాస్త్రవేత్తలు చెప్పిందానికంటే జనాభా వేగంగా పెరుగుతూ ఉంది. వర్ధమాన దేశాలలో జనాభా పెరుగుతున్న తీరును బట్టి 2030 నాటికి ప్రపంచ జనాభా8.5 బిలియన్లు చేరుకోబోతున్నది. 2050 నాటికి 9.7 బిలియన్లు, 2100 నాటికి 10.9బిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు లెక్కలు కట్టారు. అయితే. జనాభా పెరుగుదల రేటు మాత్రం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. 2100 నాటికి ప్రపంచ జనాభా 10.9 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసినా వార్షిక పెరుగుదల రేటు మాత్రం 0.1 శాతం కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇపుడున్న రేటు కంటే ఇది చాలా తక్కువ. 1950 కి ఈ రోజుకు మధ్య ప్రపంచ జనాభా వార్షిక పెరుగుదల రేటు 1 శాతం నుంచి 2 శాతం మధ్య ఉండింది.
ఈ ఏడాది జూన్ 17న అమెరికాలోని ప్యూ రీసెర్చ్ సెంటర్ జనాభా లెక్కల మీద ఒక నివేదిక విడుదలచేసింది. దీని ప్రకారం, ఈ శతాబ్దాంతానికి జనాభా పెరుగుదల రేటు ఆగిపోతుంది. దీనికి కారణం ప్రపంచ వ్యాపింతా ప్రజలలో ఫర్టైలిటీ రేటు బాగా పడిపోవడమే.
2019లో ఐక్యరాజ్య సమితి World Population Prospects ను విడుదల చేసింది. ఇందులో ఈ శతాబ్దంలో జనాభా గురించి అనేక ఆసక్తి కరమయినవిషయాలు వెల్లడించింది. అవి:
ప్రపంచ వ్యాపితంగా జనాభా వయసుపెరిగే కొద్ది సంతానశక్తి(Fertility) తగ్గిపోతుంది. ఇపుడు ఫర్టైలిటీ రేటు2.5. 2100 నాటికి ఒక మహిళ సంతాన శక్తి 9 పిల్లల స్థాయికి పడిపోతుంది.
ప్రపంచ మీడియన్ ఏజ్ (Median Age)42కు పెరుగుతుంది. మీడియన్ ఏజ్ అంటే జనాభాలో సగ బాగాన్ని నిర్ణయించే వయసు. అంటే మీడియన్ ఏజ్ కింద ఉన్నవాళ్లంతా యువకులు, పైనున్నసగం ఆపై వయసున్న వారు. ఇపుడు మీడియన్ ఏజ్ 31 సంవత్సరాలు. 1950లో ఇది కేవలం 24 సంవత్సరాలు. భారతదేశానికి సంబంధించి 2050 నాటికి మీడియన్ ఏజ్ 38.1 సంత్సరాలు.2015 లో ఇది 26.8 సంవత్సరాలు.1970లో ఇది 19.3.
ప్రపంచంలోని ఇతర ఖండాలతో పోలిస్తే ఆఫ్రికాలో మాత్రమే ఈ శతాబ్దంలో జనాభా పెరుగుదల జోరుగా ఉంటుంది.
యూరోప్, లాటిన్ అమెరికాలలో 2100 నాటికి జనాభా పడిపోవడం మొదలవుతుంది
ఆసియా జనాభా 2020 నాటికి 4.6 బిలియన్లకు, 2055 నాటికి 5.3 బిలియన్లకు చేరుకుంటుంది. అపైన తగ్గడం మొదలవుతుంది.
’అమెరికా జనాభా బాగా పెరుగుతుంది. దీనికి కారణం ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆదేశానికి వలస వెళ్లడమే.
2027 నాటి ఇండియా జనాభా చైనాను దాటిపోతుందని అంచనా వేశారు.
2020-2100 మధ్య 90 దేశాలలో జనాభా తగ్గిపోవడం మొదలవుతుంది.
ఫీచర్ ఫోటో:PIB India