శ్రీనివాసమంగాపురంలో అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క మ‌హా యాగం…ఎందుకు చేస్తారు?

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 16 నుండి 18వ తేదీ వ‌ర‌కు  అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క శ్రీ‌నివాస మ‌హా యాగం జరుగుతుంది.

అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క శ్రీ‌నివాస మ‌హా యాగంలో ప్ర‌ధానాచార్యుల  ఆధ్వ‌ర్యంలో ఆల‌యంలో అష్టోత్తర శతకండ అంటే 108 హోమ‌గుండాలు ఏర్పాటు చేసి యాగం చేస్తారు.

అంతేకాదు, వివిద రాష్ట్రాల‌కు చెందిన 108 మంది ప్ర‌ముఖ రుత్వికులు హోమంలో పాల్గొంటారు.

ఈ యాగం దేశబాగోగులకోసం చేస్తారు.

యాగం ద్వారా దేశంలో రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌కాలంలో వ‌ర్ష‌లు కురిసి, సంవృద్ధిగా పంట‌లు పండి సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని ఈ యాగం నిర్వ‌హిస్తారు.

స్వామివారి వైభ‌వాన్ని న‌లు దిశ‌ల వ్యాప్తి చేయ‌డానికి శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఈ యాగం నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా అక్టోబ‌రు 16వ తేదీ ఉద‌యం 9.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు ఆచార్య‌వ‌ర‌ణం, విష్వ‌క్సేనారాధ‌న‌ము, పుణ్యాహ‌వ‌చ‌నం, వాస్తుహోమం, సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణంతో మ‌హా యాగ‌ము ప్రారంభ‌మ‌వుతుంది.

అక్టోబ‌రు 17న ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు గో పూజ‌, శ్రీ భూ స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌న్నారు.

అక్టోబ‌రు 18న ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు గ‌జ‌పూజ‌, పూర్ణాహుతితో మ‌హా యాగం ముగుస్తుంది.

.